Exoplanet: భూమికి అల్లంత దూరంలో జీవం..? నాసా టెలిస్కాప్‌ బయటపెట్టిన సంచలన నిజం!

Exoplanet: భూమికి సుమారు 124 లైట్ ఇయర్స్‌ దూరంలో ఉన్న ఓ గ్రహం నుంచి వచ్చిన సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Update: 2025-04-18 03:30 GMT

Exoplanet: భూమికి అల్లంత దూరంలో జీవం..? నాసా టెలిస్కాప్‌ బయటపెట్టిన సంచలన నిజం!

Exoplanet: ప్రతి తారలో ఒక ఊహ.. ప్రతి నక్షత్రంలో ఒక ఆశ... మనకెక్కడో దూరంలో.. తెలియని లోకాల్లో ఇంకా ఏదైనా ఉందేమో అన్న తపన మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటుంది. అడవులు దాటి.. ఆకాశాలపైకి ఎగిరిన మన కలలు... ఇప్పటికీ కొన్ని రహస్యాలను మాత్రం ఛేదించలేకపోయాయి. ఇలాంటి సమయంలో భూమి కాకుండా వేరే చోట కూడా నివాసముందనే వార్త వినిపిస్తే ఎలా ఉంటుంది? చాలా దూరంలో.. మనకు తెలియని దారుల్లో ఒక గ్రహం మనకో సందేశం ఇస్తోందట..! అక్కడ కూడా జీవం ఉండే అవకాశాలు ఉన్నాయట..! ఇది సైంటిస్టులు కొత్తగా చెప్పిన అద్భుతమైన విషయం. ఇంతకీ ఆ గ్రహం ఎక్కడుంది? ఇతర గ్రహాల్లో జీవం ఉన్నట్లు ఆధారాలెవైనా దొరికాయా?

ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు వింటే షాక్ అవ్వాల్సిందే. భూమికి సుమారు 124 లైట్ ఇయర్స్‌ దూరంలో ఉన్న ఓ గ్రహం నుంచి వచ్చిన సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. K2-18b అనే ఈ గ్రహం వాతావరణంలో కొన్ని ప్రత్యేకమైన గ్యాసులు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అవి మన భూమిపై సముద్రాల్లో ఉండే సూక్ష్మ జీవులు ఉత్పత్తి చేసే రసాయనాలట. దీని అర్థం ఏంటంటే... అక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఉందన్న మాట! ఇవి ఊహలు కాదు.. నేరుగా జెమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా వచ్చిన సైంటిఫిక్ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాలు చెబుతున్నారు. ఇంతవరకూ మనం సినిమా లాంటి కథలలోనే చూసిన విషయాలు.. ఇప్పుడు నిజానికి దగ్గరవుతున్నాయేమో అనిపించేలా వారి మాటలు వినిపిస్తున్నాయి.

ఈ గ్రహం గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇది భూమితో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. భూమి కన్నా సుమారుగా 2-3 రెట్లు పెద్ద డైమెటర్ ఉంటుంది. మన గ్రహం ఎలాగైతే సూర్యుణ్ని చుట్టూ తిరుగుతుందో, ఇదికూడా ఓ రెడ్‌ డ్వార్ఫ్ అనే నక్షత్రాన్ని చుట్టూ తిరుగుతోంది. ఇక ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే.. ఇది నీరు ద్రవ రూపంలో ఉండేందుకు అవకాశమున్న ప్రాంతం. అంతేకాదు.. అక్కడ హైడ్రోజన్ అనుకూలిత వాతావరణం కూడా ఉండొచ్చని అంచనా. అలాంటి ప్రదేశాల్లో సూక్ష్మ జీవాలు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మన భూమిలో ఉన్న మైక్రోబ్స్ లాగే అక్కడా ఏవైనా జీవరాశులు ఉండే అవకాశం ఉందేమోనన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఈ గ్రహంలో DMS అనే గ్యాస్ కనిపించింది. ఇన్ని విషయాలు చూస్తే... భూమికి వెలుపల జీవం ఉందేమో అనే ప్రశ్నకు సమాధానం దాదాపుగా దొరికినట్టే అనిపిస్తోంది. ఇది పూర్తిగా నిర్ధారించడానికి ఇంకొన్ని పరిశోధనలు అవసరం. ఈ లెక్కన చూస్తే.. భవిష్యత్తులో అంతరిక్షంలో జీవం ఉన్న గ్రహాలను కనుగొనవచ్చని అర్థం చేసుకోవచ్చు. మనమంతా ఎదురుచూస్తున్న ఆ రోజు... అంటే భూమికి బయట జీవాన్ని కనిపెట్టే రోజు.. మరీ దూరంలో లేదనిపిస్తోంది.

Tags:    

Similar News