Realme: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా.. అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లు.. తక్కువ ధరకే రియల్‌మీ ఫొన్లను సొంతం చేసుకోండి..!

Amazon Sale: కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ బ్రాండ్ నెక్స్ట్ జనరేషన్ సెలబ్రేషన్ సేల్ Amazon, Realme అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

Update: 2023-06-07 14:30 GMT

Realme: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా.. అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లు.. తక్కువ ధరకే రియల్‌మీ ఫొన్లను సొంతం చేసుకోండి..!

Amazon Sale: Realme కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ బ్రాండ్ నెక్స్ట్ జనరేషన్ సెలబ్రేషన్ సేల్ Amazon, Realme అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. Realme కొత్త సేల్ జూన్ 8 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో Realme Narzo సిరీస్‌లోని రెండు ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

Realme Narzo N53, Realme Narzo N55లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ గత నెలలోనే Realme Narzo N53ని లాంచ్ చేసింది. కాగా నార్జో ఎన్55 ఏప్రిల్‌లో కంపెనీ ప్రారంభించింది. వాటి ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం..

Realme Narzo N55, Narzo N53 ధర..

Narzo N55 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 10,499 వద్ద అందుబాటులో ఉంది. అయితే నార్జో N53ని రూ.8,699కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Realme.com, అమెజాన్‌లోనూ అందుబాటులో ఉంది.

Realme Narzo N55 ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999కి వస్తుంది. దీనిపై 500 రూపాయల తగ్గింపు ఇస్తోంది. అదే సమయంలో, దాని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999లుగా ఉంది. ఇది రూ. 750 తగ్గింపుతో సేల్‌కు అందుబాటులో ఉంది. Narzo N53 ధర రూ. 8,999లుగా ఉంది. దీనిని రూ. 300 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్ ఏమిటి?

Realme Narzo N55 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 680Nitsతో వస్తుంది. Helio G88 ప్రాసెసర్‌పై ఫోన్ పనిచేస్తుంది. ఇది 4GB RAM / 6GB RAM, 64GB / 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 64MP + 2MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది.

ముందు భాగంలో, కంపెనీ 8MP సెల్ఫీ కెమెరాను అందించింది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Realme Narzo N53 గురించి మాట్లాడితే, దీనికి 6.74-అంగుళాల IPS LCD డిస్ప్లే లభిస్తుంది. ఈ ఫోన్ Unisoc T612 ప్రాసెసర్, 50MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13లో పనిచేస్తుంది.

Tags:    

Similar News