BSNL Azadi Ka Plan: కేవలం 1 రూపాయికి రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్.. BSNL కొత్త ప్లాన్‌తో మార్కెట్‌లో సంచలనం
BSNL Azadi ka plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
BSNL Azadi ka plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్’ పేరుతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను కంపెనీ ప్రారంభించింది. కేవలం రూ.1కే నెల రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటా ప్యాక్‌తో ఈ ప్లాన్‌ను అందిస్తోంది.
ఈ ప్లాన్ ప్రత్యేకంగా కొత్త వినియోగదారుల కోసమే అందుబాటులో ఉంటుంది. అంతేగాకుండా సిమ్ కూడా ఉచితంగా లభిస్తుంది. బీఎస్ఎన్‌ఎల్ ఈ వివరాలను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ ఆఫర్ 2025 ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌ను పొందాలనుకునే వినియోగదారులు సమీప బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రిటైలర్‌ను సంప్రదించవచ్చు.
ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా 4జీ సేవలను విస్తరించడంతో పాటు, కొత్త వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్‌ఎల్ ఈ కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం.