Tooth: పుచ్చుపట్టిపోయి ఊడిపోయిన పళ్లు మళ్లీ వస్తాయి.. సైంటిస్టులు చేసిన సూపర్ డూపర్ రీసెర్చ్!
మన నోట్లో ఊడిపోయిన దంతాల స్థానంలో సహజంగా కొత్త పళ్లు పెరిగే అవకాశం ఏర్పడింది.
Tooth: పుచ్చుపట్టిపోయి ఊడిపోయిన పళ్లు మళ్లీ వస్తాయి.. సైంటిస్టులు చేసిన సూపర్ డూపర్ రీసెర్చ్!
Tooth: మనిషికి ఒకసారి శాశ్వత పళ్లు రాలిపోతే తిరిగి పెరగడం సాధ్యమయ్యేది కాదు. కానీ కొన్ని జంతువులకు మాత్రం అది సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే సూత్రాన్ని మనుషులకు అన్వయించేందుకు శాస్త్రవేత్తలు అద్భుతం చేసినట్టు తెలుస్తోంది. లండన్‌కి చెందిన కింగ్స్ కాలేజ్, ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు మానవ దంతాలను ప్రయోగశాలలో తొలిసారి విజయవంతంగా పెంచారని వెల్లడించారు.
ఇది సాధ్యమైన పద్ధతి ఏమిటంటే, మన దవడలో దంతాలు ఎలా అభివృద్ధి చెందతాయో అదే ప్రక్రియను బయోమెటీరియల్, పోషకాలు వంటి సాధనాలతో ల్యాబ్‌లో పునరావృతం చేశారు. జీవ కణాలు ఒకదానికొకటి సంకేతాలు ఇచ్చుకుంటూ, చిన్న చిన్న పళ్లు మాదిరిగా పెరిగాయి. ఈ కణాలన్నీ మనిషి శరీరానికి సంబంధించినవే కావడంతో శరీరంలో వీటిని తిరస్కరించే అవకాశం చాలా తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ విజయంతో ఇక భవిష్యత్తులో మన నోట్లో ఊడిపోయిన దంతాల స్థానంలో సహజంగా కొత్త పళ్లు పెరిగే అవకాశం ఏర్పడింది. లేకపోతే మన దంత కణాలతో ల్యాబ్‌లోనే కొత్త దంతాలను తయారుచేసి నోట్లో అమర్చే వీలుంటుంది. అయితే ఇది ఇప్పట్లో సాధ్యపడేది కాదు. ఈ చికిత్సను మానవులపై ప్రయోగించాలంటే ఇంకా ఎన్నో అధ్యయనాలు, సమయం కావాల్సిందే. ఇంకా దంతాలను నోటిలోనే సహజంగా పెరగేలా చేయాలా లేదా బయట తయారుచేసి అమర్చాలా అన్నది కూడా ఒక పెద్ద సవాల్‌గా మారింది. అయినా, ఈ ముందడుగు దంత వైద్య రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది. దీని ద్వారా లక్షల మంది దంత సమస్యలతో బాధపడేవారికి భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది.