Waterproof Phones: 15000 వేల లోపు వాటర్ ఫ్రూఫ్ మొబైల్స్ కావాలా.. అయితే వీటిని గమనించండి..!
Waterproof Phones: ఈ మధ్య స్మార్ట్‌ఫోన్లు తొందరగా పాడవుతున్నాయి. అంతేగాక కొన్ని పనులు చేస్తున్నప్పుడు అనుకోకుండా కిందపడుతున్నాయి.
Waterproof Phones: 15000 వేల లోపు వాటర్ ఫ్రూఫ్ మొబైల్స్ కావాలా.. అయితే వీటిని గమనించండి..!
Waterproof Phones: ఈ మధ్య స్మార్ట్‌ఫోన్లు తొందరగా పాడవుతున్నాయి. అంతేగాక కొన్ని పనులు చేస్తున్నప్పుడు అనుకోకుండా కిందపడుతున్నాయి. దీనివల్ల వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మొబైల్ చిన్న సమస్యకే పనికిరాకుండా పోతున్నాయి. ముఖ్యంగా కొన్ని సెల్‌ఫోన్లు నీటిలో పడితే ఇక అంతే. అవి పనికి రాకుండా పోతాయి. అందుకే చాలామంది వాటర్ ఫ్రూఫ్ సెల్‌ఫోన్లు కొనడానికి ఇష్టపడుతున్నారు. అయితే చాలామంది వీటి ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు. పదిహేను వేల లోపు వచ్చే అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. రెడ్‌మి 10 ప్రైమ్ 2022
ఈ రెడ్‌మి ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్‌తో ఉంటుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌గా పని చెస్తోంది. ఫోన్ ప్రారంభ ధర ₹ 11,499గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్‌పై రూ. 10,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పోందవచ్చు.
2. OPPO K10
Oppo ఫోన్ IP5X ప్రొటెక్ట్‌ను కలిగి ఉంటుంది. తేలికపాటి నీటి స్ప్లాష్‌లు పడిన ఫొన్ నార్మల్‌గానే పని చెస్తోంది. 6GB + 128GB వేరియంట్ గల ఈ ఫోన్ ధర రూ. 14,990గా ఉంది. Flipkartలో ఈ ఫోన్‌పై రూ. 12,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది.
3. Poco M4 Pro 5G
ఈ Poco ఫోన్ IP53 రక్షణతో వస్తుంది. ఇది డస్ట్‌ప్రూఫ్‌గా ఉంటుంది. అలాగే తేలికపాటి నీటి స్ప్లాష్‌ల పడిన కూడా సురక్షితంగా ఉంటుంది. అధికారిక సైట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. 4GB + 64GB వేరియంట్ గల ఈ ఫోన్ అమెజాన్‌లో ₹ 14,215, Flipkartలో ₹ 15,059లో అందుబాటులో ఉంది.