Smartphone EMI: ఈఎంఐలో స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా.. ఈ చిట్కాలు పాటించి డబ్బులు ఆదా చేయండి..!

Smartphone EMI: కొంతమందికి మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఉంటుంది. కానీ బడ్జెట్‌ సరిపోదు దీంతో నిరుత్సాహానికి గురవుతారు.

Update: 2023-08-03 04:20 GMT

Smartphone EMI: ఈఎంఐలో స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా.. ఈ చిట్కాలు పాటించి డబ్బులు ఆదా చేయండి..!

Smartphone EMI: కొంతమందికి మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఉంటుంది. కానీ బడ్జెట్‌ సరిపోదు దీంతో నిరుత్సాహానికి గురవుతారు. ఇలాంటి సమయంలో తెలివిగా ఆలోచిస్తే ఎంత ఖరీదైన ఫోన్‌ అయినా భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ కొనేటప్పుడు కచ్చితంగా కొన్ని చిట్కాలని పాటించాలి. వీటివల్ల కొంత డబ్బుని ఆదా చేసుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఈ విధంగా డిస్కౌంట్‌

స్మార్ట్‌ఫోన్ ఖరీదైనది అయినప్పుడు దానిని కొనుగోలు చేయలేరు. దానికి సరిపడ బడ్జెట్‌ని తయారుచేయాలి. కానీ ఈరోజుల్లో ఒక ఆప్షన్ ఉంది. ఈఎంఐలో సులభంగా కొనుగోలు చేయవచ్చు. నెలకి కొంత అమౌంట్‌ని చెల్లించి మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ని తీసుకోవచ్చు. అంతేకాదు ఈఎంఐలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల బంపర్ తగ్గింపును పొందుతారు. ఉదాహారణకి స్మార్ట్‌ఫోన్ రూ.1 లక్ష అయితే దానిపై రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

వాస్తవానికి స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై కొన్ని బ్యాంకులు ఆఫర్లు అందిస్తాయి. వీటిని ఉపయోగించి 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. కానీ అన్ని బ్యాంకులు ఆఫర్‌లు ఇవ్వలేవు. ఆఫర్‌ ఉన్న బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని కలిగి ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు ఈఎంఐలో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై కూడా డిస్కౌంట్‌ అందిస్తాయి. నెలవారీ వాయిదాలు ఎంచుకోవడం వల్ల చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు. దీనివల్ల ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా తగ్గింపు కూడా లభిస్తుంది.

Tags:    

Similar News