iPhone 14 Price Cut: ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది..!

iPhone 14 Price Cut: ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఈ ఐఫోన్ ధర భారీగా తగ్గింది. టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 14 కొనుగోలుపై బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది.

Update: 2025-01-18 08:35 GMT

iPhone 14 Price Cut: ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది..!

iPhone 14 Price Cut: ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఈ ఐఫోన్ ధర భారీగా తగ్గింది. టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 14 కొనుగోలుపై బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 30,901 సేవ్ చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

ఐఫోన్ 14 2023లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది A15 బయోనిక్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా,  12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 512GB స్టోరేజ్, 3279mAh బ్యాటరీ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం లాంచ్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నారు.

iPhone 14 Offer

ఐఫోన్ 14 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 50,999కి అందుబాటులో ఉంది. మీ HDFC క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 2000 తగ్గించారు. అంటే ఈ ఫోన్ ను రూ. 30,901కి సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ 256GB+ 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెడ్, బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టెరైల్, ఎల్లో కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

iPhone 14 Features

ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్, ఇందులో ఫేస్ ఐడి సెన్సార్ కూడా ఉంది.  మొబైల్‌లో యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్ ఉంది. ఫోన్ 4GB RAM 28GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14 ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో OISతో కూడిన 12-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు,  వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ 3279mAh కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొడక్ట్ చేయడానికి  IP68 రేటింగ్ ఉంది.మొబైల్ iOS 17 OSతో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

Tags:    

Similar News