Airtel Adobe Offer: ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్.. రూ. 4,000 విలువైన అడోబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!
Airtel Free Adobe Express Premium Offer: ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ గిఫ్ట్! రూ. 4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు ఏడాది పాటు ఉచితం. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ చూడండి.
Airtel Adobe Offer: ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్.. రూ. 4,000 విలువైన అడోబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!
Airtel Free Adobe Express Premium Offer: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ఒక క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ 'అడోబ్' (Adobe)తో జతకట్టిన ఎయిర్‌టెల్, తన యూజర్లకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.
సాధారణంగా ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం ఏడాదికి రూ. 4,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్ మొబైల్, వై-ఫై (బ్రాడ్‌బ్యాండ్), మరియు DTH కస్టమర్లు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ సేవలను పొందవచ్చు. ప్రపంచంలోనే ఒక టెలికాం కంపెనీ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారి అని సంస్థ పేర్కొంది.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంతో కలిగే లాభాలు:
క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి, విద్యార్థులకు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇది ఒక వరమని చెప్పవచ్చు. ఇందులో ఉండే ముఖ్యమైన ఫీచర్లు ఇవే:
♦ AI టూల్స్: డిజైన్ అనుభవం లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రొఫెషనల్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేయవచ్చు.
♦ టెంప్లేట్లు & ఫాంట్స్: వేలాది డిజైన్ టెంప్లేట్లు, 30,000కు పైగా ప్రీమియం ఫాంట్లు అందుబాటులో ఉంటాయి.
♦ క్లౌడ్ స్టోరేజ్: మీ ఫైల్స్ భద్రపరుచుకోవడానికి 100GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది.
♦ ఎడిటింగ్ ఫీచర్స్: వన్-ట్యాప్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, నో వాటర్‌మార్క్స్, ఆటో క్యాప్షన్స్ మరియు ఇన్‌స్టంట్ రీసైజ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి? (Step-by-Step)
ఎయిర్‌టెల్ కస్టమర్లు సింపుల్‌గా ఈ కింది స్టెప్స్ ఫాలో అయ్యి ఆఫర్ పొందవచ్చు:
♦ మీ ఫోన్‌లో Airtel Thanks యాప్ ఓపెన్ చేయండి.
♦ పైన ఉన్న మెనూ (త్రీ లైన్స్) ఐకాన్‌పై క్లిక్ చేయండి.
♦ అందులో 'Rewards and OTTs' సెక్షన్‌ను ఎంచుకోండి.
♦ అక్కడ కనిపించే Adobe Express Premium ఆఫర్‌ను సెలెక్ట్ చేయండి.
మీ అడోబ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి లేదా కొత్తగా రిజిస్టర్ చేసుకోండి.
గమనిక: ఈ ఆఫర్ పొందడానికి మీ క్రెడిట్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం మరియు సురక్షితం అని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. డిజిటల్ క్రియేటర్లకు ఇది ఒక గొప్ప అవకాశం, వెంటనే మీ యాప్‌లో ఈ ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోండి!