ల్యాప్‌టాప్‌ ఛార్జ్‌ చేయడానికి విద్యుత్‌ అవసరం లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..!

ల్యాప్‌టాప్‌ ఛార్జ్‌ చేయడానికి విద్యుత్‌ అవసరం లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..!

Update: 2023-01-29 15:00 GMT

ల్యాప్‌టాప్‌ ఛార్జ్‌ చేయడానికి విద్యుత్‌ అవసరం లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..!

Solar Power Bank: ఎక్కువ విద్యుత్ వినియోగించే అనేక చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి. మొబైల్, ల్యాప్‌టాప్‌లు ఈ కోవలోకే వస్తాయి. చాలామంది వీటిని పట్టించుకోరు కానీ వీటివల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువగానే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ చింతవద్దు. ఛార్జింగ్‌ కోసం విద్యుత్ అవసరం ఉండదు. ఎందుకంటే మార్కెట్‌లోకి సోలార్‌ పవర్‌ బ్యాంక్‌ వచ్చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సోలార్ పవర్ బ్యాంక్

మార్కెట్‌లో అనేక విద్యుత్ ఛార్జ్ పవర్ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. అయితే కరెంటు లేకుండా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను త్వరగా ఛార్జ్ చేసే సోలార్ పవర్ బ్యాంక్ కూడా వచ్చేసింది. ధర కూడా 2 వేల లోపే ఉంది.ఇది చూడటానికి సాధారణ పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది. సూర్యకాంతితో ఛార్జ్ చేయవచ్చు.

దీనిపైన సోలార్ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లకి అవసరమయ్యే విద్యుత్‌ని సేకరించుకుంటుంది. తర్వాత దీనిని ఛార్జింగ్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ సాధారణ పవర్ బ్యాంక్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది స్థానిక మార్కెట్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇది చాలా చౌకగా అందుబాటులో ఉంటుందని గమనించండి.

Tags:    

Similar News