కరోనా అంతం తర్వాతే క్రికెట్ : యువరాజ్ సింగ్

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా అన్ని క్రీడా టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-25 13:39 GMT
Yuvraj Singh(file photo)

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా అన్ని క్రీడా టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ కాస్తా 2021కి వాయిదా పడ్డాయి. ఐపీఎల్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచకప్ పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.

అయితే ఖాళీ స్టేడియాల్లో క్రీడలను తిరిగి ప్రారంభించాలని క్రీడా సంఘాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను సమూలంగా నాశనం చేసిన తర్వాతే క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని అభిప్రాయపడ్డాడు.

''కరోనా వైరస్ బారి నుంచి ముందుగా మన దేశాల్ని, ప్రపంచాన్ని కాపాడుకోవాలని. కోవిడ్ సమూలంగా అంతం చేయాలి అన్నారు. వైరస్ విజృంభించే కొద్ది క్రీడాకారులు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇది పెరిగే కొద్ది ఆటగాళ్లు బయటకు రావడానికి, మైదానాలకు వెళ్లడానికి, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటానికి భయపడతారు.

క్రికెట్ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. దానికి తోడుగా కోవిడ్ భయం ఉండకూడదు'' అని యువీ అన్నాడు. '' బ్యాటింగ్ చేసే సమయంలో గ్లోవ్స్‌ ధరిస్తారు. ఆటగాళ్ళు అరటిపండ్లు తినాలనిపిస్తుంటుంది. కానీ ఇతర ఆటగాళ్లు దాన్ని తీసుకువస్తారు. దీంతో అరటిపండు కూడా తినకూడదని భావిస్తారు. మీ మదిలో కరోనా భయం ఉంటుంది. బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపైనే దృష్టి సారించాలి. ఇలా చేయాలంటే కరోనా అంతమొందించాలి. ఆ తర్వాతే ఆటను తిరిగి ప్రారంభించాలి అని యువరాజ్ పేర్కొన్నాడు. 

Tags:    

Similar News