Wrestler Sushil Kumar Arrested: ఎట్టకేలకు రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్
Wrestler Sushil Kumar Arrested: సాగర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
Wrestler Sushil Kumar:(Twitter Image)
Wrestler Sushil Kumar Arrested: చిక్కడు దొరకడులా మారిన సుశీల్.. ఎట్టకేలకు దొరికాడు. ఎవరికీ చిక్కకపోవడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి మరీ వెతికినా బాస్ దొరకలేదు. కాని ఇప్పుడు దొరికిపోయాడు. యూపీ నుంచి పంజాబ్ వెళుతుండగా ఓ టోల్ గేట్ సీసీ ఫుటేజిలో సుశీల్ కనపడ్డాడు. దీంతో పంజాబ్ లో ఆయన ఫ్రెండ్ సర్కిల్ ను టార్గెట్ చేసి వెతకడంతో చిక్కాడు. హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
జూనియర్ రెజ్లర్ సాగర్ రాణాపై దాడి చేసి అతడి మృతికి కారకుడయ్యాడని సుశీల్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. సాగర్ మృతి చెందినప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలోనే ఉన్నాడు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి.. సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపితే రూ.1 లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు. సుశీల్ కోసం పలు రాష్ట్రాల్లో దాదాపు 8 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సుశీల్ కుమార్ పంజాబ్‌లో పట్టుబడినట్లు పేర్కొంటున్నారు.
అయితే.. సుశీల్ కుమార్ కారులో వెళుతుండగా యూపీలోని మీరట్ టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైదరల్ అయ్యాయి. ఈ ఫొటోల ఆధారంగా సుశీల్ కుమార్ కదలికలను పసిగట్టిన పోలీసులు.. పంజాబ్ దిశగా వెళ్లాడని గుర్తించారు. ఈ క్రమంలో పంజాబ్‌లో సుశీల్ కుమార్‌తో పాటు అజయ్ కుమార్ అనే మరో అనుమానితుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. వారిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.