Women's ODI World Cup 2025: నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్.. తొలిమ్యాచ్‌లో భారత్ Vs శ్రీలంక

Women's ODI World Cup 2025: మహిళల క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది.

Update: 2025-09-30 03:54 GMT

Women's ODI World Cup 2025: మహిళల క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. ఈసారి భారత్‌ ఆతిథ్యమిస్తున్న టోర్నీ ఇవాళ గువహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకను ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి.

రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో సాగే టోర్నీలో ప్రతి జట్టు.. మిగతా ఏడు జట్లతో ఒక్కో లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశ ముగిసేసరికి టాప్‌-4 నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ అక్టోబర్ 26న ముగుస్తుంది. 29, 30 తేదీల్లో సెమీస్ జరుగుతాయి. పైనల్ నవంబర్ 2 న ఉంటుంది.

Tags:    

Similar News