IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఐపీఎల్ రద్దు కాలేదు
IPL 2025: పాకిస్తాన్ దాడి తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను నిలిపివేసింది.
IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఐపీఎల్ రద్దు కాలేదు
IPL 2025: పాకిస్తాన్ దాడి తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను నిలిపివేసింది. అయితే, ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. వారం రోజుల తర్వాత దీనిపై పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్వయంగా ఈ టోర్నమెంట్‌ను కేవలం వారం రోజుల పాటు మాత్రమే నిలిపివేసినట్లు సమాచారం అందించింది. 7 రోజుల తర్వాత పరిస్థితులను సమీక్షిస్తారు. ఆ తర్వాత ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కావచ్చు.
బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ కొత్త షెడ్యూల్‌ను వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ..ఐపీఎల్ ను పూర్తిగా నిలిపివేయలేదని తెలిపారు. దీనిని కేవలం వారం రోజుల పాటు మాత్రమే నిలిపివేశారు. పరిస్థితులను సమీక్షించిన తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.
ఐపీఎల్ పై ప్రకటన
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారం రోజుల పాటు ఐపీఎల్ నిలిపివేయడంపై మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయంలో ఒక ఇమెయిల్‌ను విడుదల చేసింది. అందులో ‘ఈ నిర్ణయం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్ని జట్లతో సరైన అభిప్రాయం తీసుకున్న తర్వాత తీసుకుంది. ఈ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళనలు, భావాలతో పాటు బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్‌లు , అభిమానుల అభిప్రాయాలను కూడా షేర్ చేసుకున్నారు. బోర్డు అన్ని వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదని భావించింది’ అని పేర్కొంది.
ఐపీఎల్ ఎప్పుడు జరగవచ్చు?
వారం రోజుల తర్వాత కూడా పరిస్థితులు మెరుగుపడకపోతే బీసీసీఐ ఐపీల్ 2025 మిగిలిన మ్యాచ్ లను ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్వహించవచ్చు. ఈ సమయంలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు కష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్‌కు బదులుగా ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు జరిగాయి. ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ 11వ ఓవర్‌లోనే నిలిచిపోయింది. దీని తర్వాత లక్నో, RCB మధ్య జరిగిన మ్యాచ్ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం IPLలో ఫైనల్‌తో సహా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. బీసీసీఐ ఈ మ్యాచ్‌లను ఎలా పూర్తి చేస్తుందో చూడాలి.