RCB vs RR Match: బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీలు ఎందుకు ధరించారో తెలుసా?
RCB vs RR Match: బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీలు ఎందుకు ధరించారో తెలుసా?
Why RCB wearing Green color Jersey: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మ్యాచ్ లో కొత్తగా గ్రీన్ కలర్ జెర్సీలో ఎంట్రీ ఇచ్చింది. ఐపిఎల్ 2025 సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో క్లాసిక్ డార్క్ బ్లూ, రెడ్ కలర్ కాంబోలో జెర్సీలను ధరించింది. కానీ ఇవాళ జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో గ్రీన్ కలర్ జెర్సీలకు వేసుకుంది. కొత్త జెర్సీలతో దర్శనమిచ్చిన ఆటగాళ్లను చూసి స్టేడియంలో స్పెక్టేటర్స్, టీవీల ముందు కూర్చొన్న ఆడియెన్స్ అయోమయంలో పడ్డారు.
అయితే, ఇదే విషయమై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టేన్ రజత్ పటిదార్ టాస్ వేసే సందర్భంగానే క్లారిటీ ఇచ్చాడు. పచ్చదనాన్ని పెంచాలన్న లక్ష్యంతో మరిన్ని చెట్లను నాటాలి అనే సందేశాన్ని ఇస్తూ తమ జట్టు ఇలా గ్రీన్ కలర్ జెర్సీలను ధరించినట్లు రజత్ తెలిపాడు. అంటే ఆటలో కేవలం విజయాన్ని మాత్రమే చూడొద్దు... అందులోనూ సామాజిక బాధ్యతను చాటుకోవాలి అని బెంగళూరు ఫ్రాంచైజీ చెప్పకనే చెప్పిందన్న మాట.
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 13, 2025
బెంగళూరు ఆటగాళ్లను కొత్త జెర్సీల్లో చూసి మొదట ఆశ్చర్యపోయిన అభిమానులు, వారి నిర్ణయం వెనుకున్న ఆశయం ఏంటో తెలిశాక ఆనందంలో ముగిగిపోయారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ ఎలాంటిదో ఒక ఐడియా కోసమే తము బౌలింగ్ ఎంచుకున్నట్లు రజత్ చెప్పాడు. తమ జట్టు ఆటగాళ్ల జాబితాలో ఎలాంటి మార్పు లేదని అన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో మాత్రం ఫజల్‌హక్ ఫారూఖీ స్థానంలో వనిందు హసరంగా వచ్చాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 75 పరుగులు (10 ఫోర్లు, 2 సిక్సులు) చేశాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ ఊపుమీదున్న జైశ్వాల్, హేజల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ అయ్యాడు. సంజూ శాంసన్ 15, రియాన్ పరాగ్ 30, షిమ్రన్ హెట్మెర్ 9 పరుగులు చేశారు. ధృవ్ జురెల్ 35, నితీష్ రాణా 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజల్‌వుడ్, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ తీశారు.