కోహ్లి... నువ్వు అసాధారణ ఆటగాడివి : సునీల్ గవాస్కర్

251 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న సందర్భంగా కోహ్లి పైన ప్రశంసలు కురిపించాడు గవాస్కర్. కోహ్లి 251 మ్యాచ్‌ల్లో 43 శతకాలు, 60 అర్ధశతకాలు సాధించాడు.

Update: 2020-12-03 12:12 GMT

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పైన ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్. కోహ్లీ ప్రదర్శన అమోఘమని అన్నారు. 251 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న సందర్భంగా కోహ్లి పైన ప్రశంసలు కురిపించాడు గవాస్కర్. కోహ్లి 251 మ్యాచ్‌ల్లో 43 శతకాలు, 60 అర్ధశతకాలు సాధించాడు. అండర్ 19 నుంచి ఇప్పటివరకు అతడు బ్యాటింగ్ లో మెరుగైన విధానం, ఫిట్నెస్ సాధించిన తీరు అద్భుతం.

అతడు ఆటగాళ్ళకే కాకుండా శారీరకంగా దృఢంగా ఉండాలనుకునే వారికి కూడా ఆదర్శమని అన్నారు. అతడి నుంచి మరో వెయ్యి పరుగుల కోసం ఎదురు చూడాలి. ఐదారు నెలల్లో అది చేరుకుంటాడని ఆశిస్తున్నానని గవాస్కర్ అన్నాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 12 వేల పరుగుల మైలురాయిని అందుకొని క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. అటు ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో ఆసీస్ విజయం సాధించగా, మూడో వన్డేలో భారత్ విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి టీ 20 సిరీస్ మొదలు కానుంది. 

Tags:    

Similar News