Rahul Dravid: టీ20 ప్రపంచకప్ కాంబినేషన్‌పై పూర్తి స్పష్టత.. 100 రోజుల్లో కోచ్‌గా చాలా నేర్చుకున్నా..
Rahul Dravid: టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టు కూర్పు విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నామని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
Rahul Dravid: టీ20 ప్రపంచకప్ కాంబినేషన్‌పై పూర్తి స్పష్టత.. 100 రోజుల్లో కోచ్‌గా చాలా నేర్చుకున్నా..
Rahul Dravid: టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టు కూర్పు విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నామని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెప్టెన్ రోహిత్‌శర్మతో కలిసి జట్టు ఎలా ఉండాలనే దానిపై అవగాహనతో ఉన్నామన్నారు. కుర్రాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదన్న ద్రవిడ్.. ఒక్క మ్యాచ్‌తో లేదా సిరీస్‌తో ఒక అంచనాకు రాలేమన్నాడు.
ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్ అంచనాలు అందుకున్నాడని, మెగాటోర్నీలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. చీఫ్ కోచ్‌గా 100 రోజుల్లో చాలా నేర్చుకున్నట్లు చెప్పిన గ్రేట్ వాల్ కూర్పుపై ఆలోచిస్తూనే ప్లేయర్లపై పని ఒత్తిడిని పరిశీలిస్తున్నామన్నాడు.