Dewald Brevis DRS Drama: ఇది చీటింగ్.. ఆర్సీబీ అంపైర్లను కొనేసిందా? ఎంతకు తెగించారు బ్రో!
కానీ అప్పటికే సమయం ముగిసిందని అంపైర్ చెప్పడంతో రివ్యూ తీసుకోలేకపోయాడు.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న డివాల్డ్ బ్రెవిస్‌కు సంబంధించిన ఒక విచిత్రమైన డీఆర్‌ఎస్ వివాదం మ్యాచ్‌ను హీటెక్కించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో తొలి బంతికే బ్రెవిస్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై సందేహంతో బ్రెవిస్ డీఆర్‌ఎస్ కోసం సంకేతం ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే సమయం ముగిసిందని అంపైర్ చెప్పడంతో రివ్యూ తీసుకోలేకపోయాడు.
బంతి ప్యాడ్‌ను తాకిన క్షణంలో అంపైర్ ఔట్‌గా ప్రకటించగా, అది లెగ్ సైడ్‌కు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా బ్రెవిస్, నాన్-స్ట్రైకర్ జడేజాతో చర్చ చేసిన తర్వాతే రివ్యూకు సైన్ ఇచ్చాడు. కానీ అప్పటికే 15 సెకన్ల గడువు ముగిసిపోయింది. మళ్లీ రీప్లేలో చూసినప్పుడు బంతి స్టంప్‌లకు చాలా దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది, అంటే అంపైర్ నిర్ణయం స్పష్టంగా తప్పు.
బ్రెవిస్‌తో పాటు జడేజా కూడా ఈ విషయమై అంపైర్‌తో చర్చకు దిగారు. అయితే అంపైర్ వాళ్ల అభ్యర్థనను తిరస్కరించడంతో వాళ్లు నిరాశ చెందారు. మ్యాచ్‌లో ఈ వివాదం తీవ్ర ప్రభావం చూపింది. చివరకు రెండు పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. అద్భుతంగా ఆడిన అయుష్ మాథ్రే (94), జడేజా (నాటౌట్ 77)ల ఇన్నింగ్స్ కూడా విఫలమయ్యాయి. ఈ విజయంతో బెంగళూరు జట్టు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే సీజన్‌లో చెన్నైపై రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈ ఫలితంతో చెన్నై పాయింట్ల పట్టికలో చివరిస్థానంలోనే ఉండిపోయింది. ఇక డీఆర్‌ఎస్ టైమింగ్, అంపైర్ నిర్ణయాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.