Suryakumar Yadav : టీమిండియాలో ఒక వ్యక్తి మిస్సింగ్.. సిరీస్ గెలిచిన ఆనందంలో సూర్య సంచలన వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తనలోని ఒక వ్యక్తిని మిస్ అవుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Suryakumar Yadav : టీమిండియాలో ఒక వ్యక్తి మిస్సింగ్.. సిరీస్ గెలిచిన ఆనందంలో సూర్య సంచలన వ్యాఖ్యలు
Suryakumar Yadav : దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తనలోని ఒక వ్యక్తిని మిస్ అవుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత ప్రెజెంటేషన్ సెషన్‌లో సూర్య మనసు విప్పి మాట్లాడాడు. జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని చెబుతూనే, ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం తాను వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.
అవును ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా సూర్య సక్సెస్ అయినప్పటికీ, బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. దీనిపై అతనే స్వయంగా స్పందిస్తూ.. "ఈ సిరీస్‌లో కెప్టెన్ సూర్యను అందరూ చూశారు కానీ, బ్యాటర్ సూర్య మాత్రం ఎక్కడో తప్పిపోయాడు. అతడిని నేను వెతకాల్సి ఉంది" అని చమత్కరించాడు. తను ఆడాలనుకున్న శైలిలో బ్యాటింగ్ చేయలేకపోయానని, క్రీజులో ఎక్కువ సమయం గడపలేకపోయానని సూర్య అంగీకరించాడు. సూర్య నిజాయితీగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూర్య ఎందుకు ఇలా అన్నాడంటే.. దక్షిణాఫ్రికాపై ఆడిన ఈ సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని సగటు కేవలం 8.50గా ఉంది. టి20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్య స్ట్రైక్ రేట్ కూడా ఈ సిరీస్‌లో 103.22 వద్దే ఆగిపోయింది. అంటే ఒకప్పటిలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే మిస్టర్ 360 ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. తన ఫామ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సూర్య ఈ విధంగా స్పందించాడు.
ముందున్నది టీ20 వరల్డ్ కప్ 2026 కావడంతో సూర్య ఫామ్‌లోకి రావడం టీమ్ ఇండియాకు చాలా కీలకం. న్యూజిలాండ్‌తో జరగబోయే తదుపరి సిరీస్‌లో ఖచ్చితంగా బ్యాటర్ సూర్య స్ట్రాంగ్‌గా రీ-ఎంట్రీ ఇస్తాడని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టు విజయాల్లో తన బ్యాటింగ్ కూడా తోడైతే ఎదురుండదని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా సిరీస్ గెలిచినప్పటికీ, తన వ్యక్తిగత వైఫల్యాన్ని అంగీకరించిన సూర్య స్పోర్ట్స్ మెన్ షిప్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.