Shubman Gill : శుభ్‌మన్ గిల్‌కు ద్రోహం చేశారా? వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై షాకింగ్ నిజాలు!
Shubman Gill : బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు అందులో శుభ్‌మన్ గిల్ పేరు ఎక్కడా కనిపించలేదు.
Shubman Gill : శుభ్‌మన్ గిల్‌కు ద్రోహం చేశారా? వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై షాకింగ్ నిజాలు!
Shubman Gill : బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు అందులో శుభ్‌మన్ గిల్ పేరు ఎక్కడా కనిపించలేదు. దీనితో భారత టెస్ట్, వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గిల్, వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడటం లేదని తేలిపోయింది. అయితే, దీనిపై వచ్చిన ఒక కొత్త నివేదిక ప్రకారం గిల్‌ను టీ20 స్క్వాడ్ నుంచి తప్పిస్తున్న విషయం గురించి ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదనే షాకింగ్ అప్‌డేట్ బయటపడింది.
ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. బీసీసీఐలోని ఒక వర్గం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం... గిల్‌ను జట్టు నుంచి తొలగిస్తున్న విషయం గురించి అతనితో ముందే మాట్లాడలేదని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, కనీసం ప్రపంచకప్ వరకు అతని కెప్టెన్సీ పదవికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టమైంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సమయంలో శుభ్‌మన్ గిల్‌కు పాదానికి గాయం తగిలినప్పుడే, టీమ్ మేనేజ్‌మెంట్ (గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ సహా) అతనికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించినట్లు నివేదిక తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో గిల్ ఆడాలని కోరుకున్నప్పటికీ, ఆ మ్యాచ్ కంటే ముందే టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని జట్టు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంటే, గిల్‌కు తెలియకుండానే అతనిపై వేటు వేశారు.
శుభ్‌మన్ గిల్ గాయంపై మొదట్లో చాలా ఊహాగానాలు వచ్చాయి. బహుశా అది ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, వైద్య పరీక్షల్లో అది తీవ్రమైన గాయం కాదని తేలింది. కాబట్టి, అతను దక్షిణాఫ్రికాపై ఐదవ టీ20 మ్యాచ్ ఆడటానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే గిల్‌ను జట్టు నుంచి తప్పించడంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది. ఫామ్ లేమి కారణంగా ఒక కీలక ఆటగాడిని, అది కూడా మాజీ వైస్-కెప్టెన్‌ను, ఇలా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.