Washington Sundar: టీ20 స్టైల్ బ్యాటింగ్.. వాషింగ్టన్ సుందర్ ఆట చూసి ముక్కున వేలేసుకుంటున్న ఫ్యాన్స్

క్రికెట్ అభిమానులందరూ వాషింగ్టన్ సుందర్ ఆట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. zw20 ఫార్మాట్ కోసం పుట్టినట్లుగా టెస్ట్ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బాల్, బ్యాట్‌తో మెరుస్తున్నాడు.

Update: 2025-08-03 05:15 GMT

Washington Sundar: క్రికెట్ అభిమానులందరూ వాషింగ్టన్ సుందర్ ఆట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. zw20 ఫార్మాట్ కోసం పుట్టినట్లుగా టెస్ట్ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బాల్, బ్యాట్‌తో మెరుస్తున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది టీమిండియా స్కోర్‌ను 396కి చేర్చాడు. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతున్నాడు. బంతితో, బ్యాట్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యం అందించాడు. అతని ధాటిగా ఆడిన ఇన్నింగ్స్ వల్లే టీమిండియా 396 పరుగులు చేయగలిగింది. ఈ సిరీస్‌లో సుందర్ ఫామ్ ఎంత బాగుందంటే, మ్యాన్చెస్టర్ టెస్ట్‌లో అతను ఒక కొత్త రికార్డు సృష్టించాడు.

మ్యాన్చెస్టర్ టెస్ట్‌లో టీమిండియా ఓటమి అంచున ఉన్నప్పుడు, కెప్టెన్ శుభమన్ గిల్ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేసి జట్టును ఆదుకున్నారు. ఆ మ్యాచ్‌లో సుందర్ తన టెస్ట్ కెరీర్‌లో మొదటి సెంచరీని సాధించాడు. కేవలం 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 101 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా ఆ మ్యాచ్‌లో ఓటమి నుండి తప్పించుకుంది.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సుందర్, 8 ఇన్నింగ్స్‌లలో 47.33 సగటుతో 284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అంతేకాకుండా, బౌలింగ్‌లో 4 టెస్ట్ మ్యాచ్‌లలో 7 వికెట్లు కూడా పడగొట్టాడు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లను నాలుగు సార్లు పెవిలియన్‌కు పంపించాడు. సుందర్ ఇప్పటివరకు తన మొత్తం కెరీర్‌లో 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 44.23 సగటుతో 752 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 వికెట్లు తీసి ఆల్ రౌండర్‌గా తన సత్తా చాటాడు.

Tags:    

Similar News