Virat Kohli: టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli: క్రికెట్‌ అభిమానులకు స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ షాకిచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బాటలోనే అతడు కూడా టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించాడు.

Update: 2025-05-12 06:38 GMT

Virat Kohli: టెస్టులకు విరాట్‌ కోహ్లీ గుడ్‌బై..!

Virat Kohli:  ఇండియన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఇన్ స్టాలోని తన ఖాతాలో ప్రకటించారు. కొద్దిరోజుల క్రితమే విరాట్ ఈ విషయమై బీసీసీఐకి అనుమతి కోరారు. మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లీకి పరుగుల వీరుడుగా మంచిపేరుంది. అనేక అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. భారత్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పటికే టీ-20లో రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇప్పుడు టెస్టులకు సైతం దూరం అయ్యాడు. మరోవైపు ఇంగ్లండుతో భారత్ టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ లు దూరమవడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.


Tags:    

Similar News