Rohit Sharma: ఎఫర్ట్‌లెస్ కాదు, ఎన్నో గంటల కష్టం.. రోహిత్ శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!

Rohit Sharma: ఎఫర్ట్‌లెస్ కాదు, ఎన్నో గంటల కష్టం.. రోహిత్ శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!
x
Highlights

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన కెరీర్‌కు సంబంధించిన ఒక బోల్డ్ స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచాడు.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన కెరీర్‌కు సంబంధించిన ఒక బోల్డ్ స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచాడు. రోహిత్ తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ రోహిత్ మాత్రం ఆ మాటతో ఏకీభవించడం లేదు. రోహిత్ శర్మ సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సహజసిద్ధమైన టాలెంట్, కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ అదంతా ఉత్త చెత్త అని కొట్టిపారేశాడు. సహజంగా వచ్చిన టాలెంట్ అంటూ ఏమీ ఉండదని, ప్రతి విజయం వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ మైదానంలో ఎంతో సునాయాసంగా ఆడుతున్నట్లు కనిపించడానికి కూడా అంతే కష్టపడాల్సి ఉంటుందని చెప్పాడు. కఠోర శ్రమ లేకుండా ఏదీ సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. ఆటగాళ్లు మైదానంలో సహజంగా ఆడుతున్నట్లు కనిపిస్తే, దాని వెనుక వారు చేసిన కృషిని ఎవరూ చూడరని అన్నాడు. ఆటగాడైనా, నాయకుడైనా గంటల తరబడి సాధన చేయాల్సిందేనని, ఇందులో ఎలాంటి మ్యాజిక్ ఉండదని తేల్చి చెప్పాడు. తాను కూడా తన కెరీర్‌ను బౌలర్‌గా ప్రారంభించానని, కానీ ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశాడు. ప్రతి ఆటగాడి అద్భుతమైన ప్రదర్శన వెనుక వారి కృషి, అంకితభావం దాగి ఉంటుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. అదే వారి నుంచి ఉత్తమమైన ఆటను బయటకు తీస్తుందని, దానినే ప్రజలు సహజసిద్ధమైన టాలెంట్‌గా భావిస్తారని అన్నాడు.

టీ20, టెస్ట్‌లకు రోహిత్ రిటైర్మెంట్

రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతని కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. కెప్టెన్‌గా ఇది రోహిత్‌కు రెండో ఐసీసీ టైటిల్. ఆ తర్వాత ఐపీఎల్ 2025 జరుగుతుండగానే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories