Virat Kohli: దటీజ్ కింగ్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు!
Virat Kohli: ఇంకా ఎన్నో మైలురాళ్లు చేరుకోవడానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రదర్శన చూస్తే మరిన్ని చరిత్రలు రాయడం ఖాయం.
Virat Kohli: దటీజ్ కింగ్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు!
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో రికార్డు తిరగరాసాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా కొత్త గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 67వ సారి 50కి పైగా పరుగులు చేశాడు. ఇది అతడికి ఐపీఎల్‌లో 59వ అర్ధశతకం కూడా. దీంతో ఇప్పటి వరకు 184 మ్యాచ్‌లు ఆడి 66 సార్లు 50కి పైగా స్కోరుల చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 260 మ్యాచ్‌లు ఆడాడు. వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.
50+ స్కోర్ల లిస్ట్‌లో కోహ్లీ, వార్నర్ తర్వాత శిఖర్ ధావన్ (53), రోహిత్ శర్మ (45), కేఎల్ రాహుల్ (43), ఏబీ డివిలియర్స్ (43) ఉన్నారు. 2008లో ఆర్సీబీ తరఫున కెరీర్ ప్రారంభించిన కోహ్లీ ఇప్పటివరకు 18 ఐపీఎల్ సీజన్లను ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్‌పై మ్యాచ్‌లో వచ్చిన హాఫ్ సెంచరీ ఈ సీజన్‌లో కోహ్లీకి నాల్గోది.
మార్చి 22న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 59*, ఏప్రిల్ 7న ముంబైపై 67, ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్‌పై 62* పరుగులతో అదరగొట్టాడు. కోహ్లీ ఆర్సీబీ తరఫున 275 టీ20 మ్యాచ్‌లలో 296 సిక్సర్లు బాదాడు. ఇంకా నాలుగు సిక్సర్లు బాదితే, ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా మరో అరుదైన రికార్డు కోహ్లీ పేరుపై పడనుంది. IPLలో అతడు బాదిన 282 సిక్సర్లతో పాటు, ఛాంపియన్స్ లీగ్ టీ20లో 14 సిక్సర్లు ఉన్నాయి.