Viral video: విరాట్ కోహ్లీ, అనుష్క డ్యాన్స్ వీడియో వైరల్
Viral video: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క మరో సారి వార్తల్లో నిలిచారు.
Viral video: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క మరో సారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోనే ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అభిమానులు విరుష్కగా పిలిచుకునే ఈ జంటకు సంబధించిన ఈ క్లిప్ దుబాయ్ లో జరిగిన ఓ షూటింగ్ సందర్బంగా తీసినట్లు తెలుస్తోంది.
నెట్టింట్ల వైరల్ అవుతున్న ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తర డ్యాన్సర్ల గ్రూపుతో కలిసి స్టెప్పులెస్తున్నారు. ఇద్దరు సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. ఈ వీడియోలో వీరిద్దరి కెమిస్ట్రీ, సహజమైన ఆనంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓ అభిమాని పేజీ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ క్లిప్, క్షణాల్లో వైరల్ అయ్యింది.
కాగా విరాట్, అనుష్క ఒకరి విజయాలను మరొకరు ఆస్వాదించడం బహిరంగంగా తమ ప్రేమను వ్యక్తపర్చడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఓసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు అందర్నీ ఆకర్షించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్ లో ఉన్న అనుష్క దగ్గరకు పరుగెత్తుకెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.