Virat Kohli : ప్రీతి జింటా సీక్రెట్ రివీల్.. విరాట్ తన ఫోన్‌లో ఏం చూపించాడో తెలుసా ?

Virat Kohli : ఐపీఎల్ మ్యాచ్‌లు కేవలం ఆటతో మాత్రమే కాదు... తెరవెనుక జరిగే ఆసక్తికరమైన సంఘటనలను కూడా అభిమానులకు అందిస్తాయి. తాజాగా విరాట్ కోహ్లీ, ప్రీతి జింటాకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ విరాట్ తన ఫోన్‌లో ప్రీతికి ఏం చూపించాడు? వారి మధ్య 18 ఏళ్ల స్నేహబంధం వెనుక దాగి ఉన్న ఆ రహస్యాన్ని ప్రీతి స్వయంగా వెల్లడించింది.

Update: 2025-04-29 05:17 GMT

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రీతి జింటా, విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ప్రీతి విరాట్ ఫోన్‌లో ఏదో ఆసక్తిగా చూస్తున్నట్లు ఫోటోలో ఉంది. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు వారి మధ్య ఏం సంభాషణ జరిగిందని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. తాజాగా ప్రీతి జింటా స్వయంగా సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ విషయం గురించి చెప్పింది. విరాట్-ప్రీతి ఫోటోను షేర్ చేస్తూ ఒక అభిమాని "ఈ వైరల్ ఫోటోలో మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు?" అని అడిగాడు.

ప్రీతి జింటా సమాధానమిస్తూ, "మేము ఒకరికొకరు మా పిల్లల ఫోటోలు చూపిస్తూ వారి గురించి మాట్లాడుకుంటున్నాము. 18 సంవత్సరాల క్రితం నేను విరాట్‌ను మొదటిసారి కలిసినప్పుడు, అతను టాలెంట్, ఉత్సాహంతో నిండిన ఒక ఉద్వేగభరితమైన టీనేజర్. ఈ రోజు కూడా అతనిలో అదే ఫైర్ ఉంది. అతను ఒక ఐకాన్. అంతే కాకుండా అతడో మంచి తండ్రి" అని రాసుకొచ్చింది. కాగా, విరాట్ కోహ్లీ 2017 డిసెంబర్ 11న బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. వీరికి వామిక అనే కుమార్తె, అకాయ్ అనే కుమారుడు ఉన్నారు.

విరాట్ కోహ్లీకి ఈ సీజన్ ఇప్పటివరకు అద్భుతంగా సాగింది. అతను 10 మ్యాచ్‌ల్లో 63.28 సగటుతో 443 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 6 అర్థ సెంచరీలు కూడా సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని జట్టు కూడా 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Tags:    

Similar News