Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‎కు అస్వస్థత ..కుర్చీలో కూర్చుని..వెనక్కి పడిపోయి

Update: 2024-08-19 05:45 GMT

Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‎కు అస్వస్థత ..కుర్చీలో కూర్చుని..వెనక్కి పడిపోయి

 Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ కు వెళ్లిన వినేశ్ ఫొగాట్..అనంతరం అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఆమెకు ఇక్కడ ఘనస్వాగతం లభించింది. అయితే ఆమె ఢిల్లీ నుంచి స్వగ్రామం హర్యాణాలో బలాలికి 10గంటల ప్రయాణించారు. స్వగ్రామంలో స్థానికులు ఆమెకు లడ్డూలను బహుమతి ఇచ్చారు. అనంతరం ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు.

అయితే సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆమె తీవ్రంగా అలసిపోయారు. దీంతో సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురయ్యారు. కాసేపు కుర్చిలోనే అలా ఉండిపోయింది. దీంతో అందరూ కంగారుపడ్డారు.  ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



Tags:    

Similar News