Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో.. కోహ్లీపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం!
Virat Kohli vs Shreyas Iyer: ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో తమ ఐదో విజయం నమోదు చేసుకుంది. 158 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది.
Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో.. కోహ్లీపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం!
Virat Kohli vs Shreyas Iyer: విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ అభిమానుల గుండెల్లో గెలిచాడు. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ తన జట్టుకు బిజెయాన్ని అందించాడు. ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో తమ ఐదో విజయం నమోదు చేసుకుంది. 158 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది.
కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని ఏడుసార్లు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టాడు. చివర్లో జితేష్ శర్మ నేహాల్ వధేరా వేసిన ఓవర్‌లో సిక్సర్ బాది గేమ్ ముగించగా, కోహ్లీ ఆసక్తికరమైన స్టైల్లో సంబరాలు చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ గెలుపు ఆర్సీబీకి ఈ సీజన్‌లో అవే మ్యాచ్‌లలో ఐదో విజయం కావడం విశేషం.
పంజాబ్‌పై విజయంలో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ముల్లాన్పూర్ వేదికగా వచ్చిన ఈ హాఫ్ సెంచరీ కోహ్లీకి ఐపీఎల్‌లో 59వది. మొత్తం 67 సార్లు ఐపీఎల్‌లో 50కి పైగా స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ ఈ ఘనత ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (66) పేరిట ఉండగా, కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు. ఆర్సీబీ విజయంలో మరో కీలక భాగస్వామ్యం కోహ్లీ-పడిక్కల్ మధ్య వచ్చింది. ఈ జంట రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించింది. పడిక్కల్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులతో 61 పరుగులు చేశాడు.
మ్యాచ్ తొలి భాగంలో ఆర్సీబీ బౌలర్లు పంజాబ్‌ను 157 పరుగులకే పరిమితం చేశారు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. పంజాబ్ తరఫున ప్రభసిమ్రన్ సింగ్ టాప్ స్కోరర్ కాగా, శశాంక్ సింగ్ 33 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగగా, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలను బతికించింది. ఇక కోహ్లీ అసాధారణ సంబరాలు, ఆత్మవిశ్వాసం అభిమానులను అలరిస్తున్నాయి.