Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి గురువుగా శ్రేయాస్ అయ్యర్.. కెరీర్ ఆకాశానికెగబాకడం ఖాయం!
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల యువ సంచలనం గురించి చర్చ జరుగుతోంది.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి గురువుగా శ్రేయాస్ అయ్యర్.. కెరీర్ ఆకాశానికెగబాకడం ఖాయం!
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల యువ సంచలనం గురించి చర్చ జరుగుతోంది. అతని విధ్వంసకర బ్యాటింగ్ చూస్తుంటే, అతను భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతాడనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోవడం, ఆపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదడం అతని కెరీర్ ఎంత వేగంగా దూసుకుపోతోందో స్పష్టం చేస్తోంది. అయితే, వైభవ్ సూర్యవంశీ గనుక శ్రేయాస్ అయ్యర్‌ను తన గురువుగా చేసుకుంటే, అతని కెరీర్ ఆకాశాన్ని కూడా దాటిపోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శ్రేయాస్ అయ్యర్‌ను గురువుగా చేసుకోవడం అంటే కేవలం ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం అని కాదు. శ్రేయాస్ అయ్యర్‌లోని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను, మెళకువలను చూసి నేర్చుకోవాలి. ఒక ఆటగాడిగా ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో గమనించి, వాటిని వైభవ్ తన జీవితంలో, తన ఆటలో అలవర్చుకోవాలి. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి, అతను ఆడే తీరు శ్రేయాస్ అయ్యర్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. బ్యాటింగ్‌లో వైభవ్ తన సహజమైన ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదే అతని బలం. కానీ, బ్యాటింగ్ కాకుండా, కెరీర్‌లో ముందుకు వెళ్లడానికి వైభవ్ సూర్యవంశీ శ్రేయాస్ అయ్యర్ నుండి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
శ్రేయాస్ అయ్యర్ నుండి వైభవ్ సూర్యవంశీ నేర్చుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు: నాయకత్వ లక్షణాలు (క్యాప్టెన్సీ), కఠిన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం (ప్రెజర్ హ్యాండ్లింగ్). ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా చర్చనీయాంశంగా మారింది. అనక్యాప్డ్ ప్లేయర్‌లను ఎక్కువగా ఆడించి కూడా మ్యాచ్‌లు ఎలా గెలవవచ్చో ఆయన ఈ సీజన్‌లో నిరూపించారు. పంజాబ్ కింగ్స్‌ను టాప్ 2 స్థానంలో నిలిపిన తొలి కెప్టెన్‌గా ఆయన నిలిచారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత జట్టుకు లేదా ఐపీఎల్‌లో ఏదైనా జట్టుకు కెప్టెన్‌గా మారాలనుకుంటే, శ్రేయాస్ అయ్యర్ నుంచి ఈ నాయకత్వ మెళకువలను నేర్చుకోవడం ఎంతో అవసరం.
ఇక, కఠిన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో శ్రేయాస్ అయ్యర్ ఒక ఉదాహరణ. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు టీమిండియాలో అతనికి చోటు దక్కలేదు. ఇది అతనికి నిరాశ కలిగించినప్పటికీ, శ్రేయాస్ ఆ నిరాశను తనపై భారంగా మార్చుకోలేదు. తన ఎంపిక గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా, ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్‌లపై దృష్టి పెట్టారు. తన ఆట ద్వారానే సమాధానం ఇచ్చారు. అద్భుతమైన ప్రదర్శన తర్వాత కూడా జాతీయ జట్టులో అవకాశం రాకపోవడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కఠిన పరిస్థితిని శ్రేయాస్ అయ్యర్ నిర్వహించిన తీరు నిజంగా అభినందనీయం. వైభవ్ సూర్యవంశీ కెరీర్ ప్రస్తుతం మంచి దశలో ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, అతను శ్రేయాస్ అయ్యర్ నుంచి కెప్టెన్సీ, ప్రెజర్ మేనేజ్ మెంట్ విధానాలను నేర్చుకుంటే, అతని కెరీర్ నిజంగానే కొత్త శిఖరాలను చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.