Vaibhav Suryavanshi: ఐపీఎల్ తర్వాత కూడా ఆగని వైభవ్ సూర్యవంశీ బ్యాట్.. 8 సిక్స్‌లతో విధ్వంసం
Vaibhav Suryavanshi: సాధారణంగా 14-15 సంవత్సరాల వయస్సు అంటే చదువుతో పాటు ఆటపాటలకు కూడా సమయం కేటాయిస్తుంటారు. చాలా మంది పిల్లలు ఈ వయసులో చదువుపై దృష్టి పెడతారు.
Vaibhav Suryavanshi: ఐపీఎల్ తర్వాత కూడా ఆగని వైభవ్ సూర్యవంశీ బ్యాట్.. 8 సిక్స్‌లతో విధ్వంసం
Vaibhav Suryavanshi: సాధారణంగా 14-15 సంవత్సరాల వయస్సు అంటే చదువుతో పాటు ఆటపాటలకు కూడా సమయం కేటాయిస్తుంటారు. చాలా మంది పిల్లలు ఈ వయసులో చదువుపై దృష్టి పెడతారు. కొందరు మాత్రం క్రీడల్లోనే తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని నిర్ణయించుకొని, ఆటకు ఎక్కువ సమయం ఇస్తారు. అయితే, వైభవ్ సూర్యవంశీ వంటి అరుదైన ప్రతిభావంతులు మాత్రం ఈ వయసులోనే ప్రపంచవ్యాప్తంగా తమ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తారు. IPL 2025లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డుల వర్షం కురిపించిన వైభవ్ సూర్యవంశీ, సీజన్ ముగిసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకునే మూడ్‌లో లేడు బౌలర్లను ఆటాడుకుంటున్నాడు.
ఐపీఎల్ అరంగేట్రం
వైభవ్ ఏప్రిల్ నెలలో రాజస్థాన్ రాయల్స్ తరపున IPL 2025లో అరంగేట్రం చేశాడు. కేవలం 14 సంవత్సరాల వయసులోనే అరంగేట్రం చేసిన ఈ యువ బ్యాట్స్‌మెన్, ఓపెనింగ్ చేస్తూ తన కెరీర్‌లో ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత తన మూడవ మ్యాచ్‌లోనే, ఈ ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాట్స్‌మెన్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి, క్రికెట్ చూసే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. IPLలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలవడమే కాకుండా, ఇది ఈ లీగ్‌లో రెండవ అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా.
మళ్ళీ 8 సిక్సర్‌లతో విధ్వంసం
IPLలో కేవలం 7 మ్యాచ్‌లలోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ వైభవ్ ఇంకా సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం ఏ రకమైన విశ్రాంతి మూడ్‌లోనూ లేడు. అందుకే ఈ యువ సంచలనం మళ్లీ బ్యాట్ పట్టి బౌలర్లను చితకబాదడం ప్రారంభించాడు. వైభవ్ ప్రస్తుతం బెంగళూరు సమీపంలో ఉన్న BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అండర్-19 ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్నాడు. అక్కడ అతను రాబోయే సిరీస్‌ల కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సన్నద్ధతలో భాగంగా ఆడిన ఒక మ్యాచ్‌లో వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ రెడ్ బాల్ మ్యాచ్‌లో వైభవ్ మొత్తం 8 సిక్సర్‌లు కొట్టి బౌలర్ల భరతం పట్టాడు.
ఇంగ్లాండ్‌లోనూ సత్తా చాటనున్న వైభవ్
వైభవ్ స్వయంగా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అందులో అతను మైదానంలోని ప్రతి ప్రాంతంలోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది మరియు అభిమానులు దీనిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. వైభవ్ ఈ బ్యాటింగ్ భారత్ అండర్-19 జట్టుకు మంచి సంకేతం, ఈ నెల చివరలో జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. అక్కడ అండర్-19 జట్టు ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో లిమిటెడ్ ఓవర్లు, నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. వైభవ్ ఈ పర్యటన కోసం జట్టులో భాగం, దీనికి అతని స్నేహితుడు ఆయుష్ మ్హాత్వే కెప్టెన్‌గా ఉన్నాడు. వైభవ్ భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు ఆడడం ఖాయమని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.