Viral video: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ..ఎందుకో తెలుసా?

Update: 2025-05-21 01:22 GMT

Viral video: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ..ఎందుకో తెలుసా?

Viral video: ఐపీఎల్ 2025లో మంగళవారం అంటే మే 20వ తేదీ జరిగిన మ్యాచ్ ఒక విధంగా చారిత్రాత్మకమైనది అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది లేకపోయినప్పటికీ, ఏ జట్టు అట్టడుగున నిలిచిపోతుందో చెప్పేందుకు ఈ మ్యాచ్ ముఖ్యమైంది. ఇక్కడ రాజస్థాన్ గెలిచింది. చెన్నై ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ ఎంఎస్ ధోని కాళ్లను మొక్కాడు. వైభవ్ ధోని కాళ్లు మొక్కుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తున్నప్పుడు, ధోనీ, వైభవ్ ఎదురెదురుగా వచ్చారు. ధోని దగ్గరగా రాగానే, వైభవ్ కరచాలనం చేయడానికి బదులుగా ఆయన కాళ్లు మొక్కాడు. ధోని వైభవ్ వైపు చూస్తూ నవ్వాడు. వైభవ్ ధోని కాళ్లు మొక్కడం అక్కడున్నవారందర్నీ ఆకట్టుకుంది. వైభవ్ కు పెద్దలు అంటే ఎంత గౌరవం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Tags:    

Similar News