Vaibhav Suryavanshi: 14 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. స్టేడియం బయటకు రెండు బంతులు.. వైభవ్ బ్యాటింగ్ అదుర్స్
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ తన సత్తా చూపించాడు. 14 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ అండర్-19 టీమ్‌పై విధ్వంసకర బ్యాటింగ్ చేసి తన దూకుడు రిపీట్ చేశాడు.
Vaibhav Suryavanshi: 14 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. స్టేడియం బయటకు రెండు బంతులు.. వైభవ్ బ్యాటింగ్ అదుర్స్
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ తన సత్తా చూపించాడు. 14 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ అండర్-19 టీమ్‌పై విధ్వంసకర బ్యాటింగ్ చేసి తన దూకుడు రిపీట్ చేశాడు. హోవ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 19 బంతుల్లో 48 పరుగులు చేశాడు. తన ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. అంటే, 42 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే సాధించాడు. సూర్యవంశీ అర్ధ సెంచరీ చేయలేకపోయినా, తన ఇన్నింగ్స్ సమయంలో బంతిని పోగొట్టేశాడు.
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు దిగగానే, అతను రెండో బంతిని కవర్ డ్రైవ్ కొట్టి పరుగుల ఖాతాను ఓపెన్ చేశాడు. వైభవ్ తన ఇన్నింగ్స్‌లోని 10వ బంతికి నిజంగా అద్భుతం చేశాడు. ఇంగ్లీష్ బౌలర్ ఫ్రెంచ్ షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని వేయగా, వైభవ్ అద్భుతమైన స్ట్రోక్ కొట్టాడు. బంతి స్క్వేర్ లెగ్ బౌండరీ దాటి స్టేడియం బయటికే వెళ్లిపోయింది. బంతి స్టేడియం బయట ఉన్న ఇళ్లలోకి వెళ్లిపోవడంతో కొత్త బంతిని తీసుకురావాల్సి వచ్చింది.
ఆరో ఓవర్‌లో అయితే వైభవ్ సూర్యవంశీ మరింత ప్రమాదకరంగా మారాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన వైభవ్, ఫాస్ట్ బౌలర్ హోమ్ వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. హోమ్ వేసిన మొదటి బంతికి సూర్యవంశీ ఒక సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఓవర్ చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టాడు. సూర్యవంశీ కొట్టిన మూడో సిక్సర్ కూడా స్టేడియం బయట ఉన్న ఇళ్లలోకి వెళ్లి పడింది. సూర్యవంశీ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను పూర్తిగా దెబ్బతీసింది.