Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. సిక్సర్ల రికార్డులు బద్దలు!
Vaibhav Suryavanshi :కేవలం 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌లో ఒక రికార్డు సృష్టించాడు. ఈ కుర్రాడి పేరు వైభవ్ సూర్యవంశీ.
Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. సిక్సర్ల రికార్డులు బద్దలు!
Vaibhav Suryavanshi : కేవలం 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌లో ఒక రికార్డు సృష్టించాడు. ఈ కుర్రాడి పేరు వైభవ్ సూర్యవంశీ. తన చిన్న వయస్సులోనే ఐపీఎల్‌లో అతను సాధించిన ఘనత ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అతని సిక్సర్ల వర్షం చూస్తే, భవిష్యత్తులో ఐపీఎల్‌లో ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు సృష్టించే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అసలు వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డు ఏంటో తెలుసుకుందాం.
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మారుమోగుతోంది. 14 ఏళ్ల ఈ యువ ఆటగాడు వయసులో చిన్నవాడైనా, ఆటలో మాత్రం దిట్ట అని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, కేవలం 122 బంతులను ఎదుర్కొని ఏకంగా 252 పరుగులు సాధించాడు. ఈ పరుగులు 206.55 స్ట్రైక్ రేట్‌తో రావడం విశేషం. అయితే, అతను కొట్టిన పరుగుల కంటే, అతను బాదిన సిక్సర్లే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
వైభవ్ సూర్యవంశీ 122 బంతుల్లో ఏకంగా 24 సిక్సర్లు బాదాడు. ఇది 20 ఏళ్ల లోపు వయసులో ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సమం చేసింది. గతంలో ఈ రికార్డును రిషబ్ పంత్ నెలకొల్పాడు. 2017 ఐపీఎల్‌లో పంత్ కూడా 24 సిక్సర్లు కొట్టాడు. అయితే, పంత్ ఈ 24 సిక్సర్ల కోసం 221 బంతులను ఎదుర్కొన్నాడు. కానీ, వైభవ్ సూర్యవంశీ కేవలం 122 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం అతని అసాధారణ పవర్-హిట్టింగ్‌కు నిదర్శనం. పంత్ కంటే 99 బంతులు తక్కువ ఆడి ఈ రికార్డును సమం చేయడం వైభవ్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపుతోంది.
వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం కేవలం 14 ఏళ్లే. అంటే, అతను 20 ఏళ్లు నిండడానికి ఇంకా ఆరు సంవత్సరాలు, ఐపీఎల్ సీజన్లు ఇంకా 5 ఉన్నాయి. ఐపీఎల్ 2025లో కేవలం 7 మ్యాచ్‌లు ఆడి 24 సిక్సర్లు కొట్టిన వైభవ్, భవిష్యత్తులో పూర్తి సీజన్లు ఆడితే ఎన్ని సిక్సర్లు బాదుతాడో ఊహించుకోవచ్చు. రాబోయే ఐదు సీజన్లలో వైభవ్ సూర్యవంశీ తప్పకుండా మరో కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. అతని సహజమైన పవర్-హిట్టింగ్ సామర్థ్యం, సిక్సర్లు కొట్టడంలో ఉన్న నైపుణ్యం చూస్తే, ఐపీఎల్ చరిత్రలో ఎవరూ బద్దలు కొట్టలేని ఒక రికార్డును అతను సృష్టించగలడని భావిస్తున్నారు.