క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాక్ పేసర్ ఉమర్ గుల్

పాకిస్తాన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ త్వరలో తీసుకున్నట్టు ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన..

Update: 2020-10-17 05:20 GMT

పాకిస్తాన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ త్వరలో తీసుకున్నట్టు ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించాడు. అందులో ఇలా పేర్కొన్నారు.. 'చాలా భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.. చాలా రోజులనుంచి ఆలోచించిన తరువాత, జాతీయ టి20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పుడూ పాకిస్తాన్ తరపున హృదయపూర్వకంగా , 100 శాతం హార్డ్ వర్క్ తో ఆడాను. క్రికెట్ మీద ఎల్లప్పుడూ నాకు ప్రేమ ఉంటుంది.' అని పేర్కొన్నాడు.

కాగా జింబాబ్వేతో 2003లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఉమర్ గుల్.. అదే ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోను అరంగేట్రం చేశాడు. గుల్ ఇప్పటి వరకు 130 వన్డేల్లో 179 వికెట్లు పడగొట్టగా, 47 టెస్టుల్లో 163, 60 టీ20ల్లో 85 వికెట్లు తీశాడు. 2008 సీజన్‌లో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో పాక్ తరపున చివరి టీ20 ఆడాడు గుల్. 

Tags:    

Similar News