West Indies Women's Team: మైదానంలో కుప్పకూలిన ఇద్దరు క్రికెటర్లు
West Indies Women's Team: టీ20 మ్యాచ్‌లో ఇద్దరు మహిళా క్రికెటర్లు ఆకస్మాత్తుగా క్రీజులో కుప్పకూలిపోయారు.
West Indies Womens Team
West Indies Women's Team: ఆంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం వెంస్టిండీస్, పాక్ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరు మహిళా క్రికెటర్లు ఆకస్మాత్తుగా క్రీజులోనే కుప్పకూలిపోయారు. వెస్టిండీస్ ప్లేయర్లు చిన్నెల్లీ ... హెన్రీ, చెడీన్ నేషన్... మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే క్రీజులో పడిపోవడంతో ఇద్దరికీ హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి...
ఇద్దరు ప్లేయర్లు పడిపోవడంతో మరో ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను బరిలో దింపి, మ్యాచ్‌ను పూర్తి చేయించింది వెస్టిండీస్ జట్టు. ఈ మ్యాచ్ లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. గాయపడిన చెడీన్ నేషన్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేయగా, చిన్నెల్లీ హెన్రీ ఒక్క పరుగుకే అవుట్ అయ్యింది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో కాస్త ఆలస్యంగా ప్రారంభమైన రెండో ఇన్నింగ్స్‌లో పాక్ లక్ష్యాన్ని డీఆర్‌ఎస్ పద్ధతిలో ఓవర్లలో 113 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు. అయితే పాక్ మహిళా జట్టులో నలుగురు ప్లేయర్లు రనౌట్ 103 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓడింది. ఆ ఆటగాళ్లు ఎందుకు పడిపోయారో చెప్పకుండా రహస్యాన్ని మెయిటెన్ చేస్తున్నారు.