Vikarabad: ఈ బస్ ఎక్కడికి పోదు..ఆర్టీసీ డిపో అధికారి వినూత్న ఆలోచన

Vikarabad: ప్రయాణికుల కోసం బస్సునే షెల్టర్‌గా మార్చిన ఆర్టీసీ డీవీఎం రమేష్ తాత్కాలిక బస్సు షెల్టర్ గా బస్సునే ఏర్పాటు

Update: 2021-04-22 12:00 GMT

టీఎస్ ఆర్టీసీ ఫైల్ ఫోటో

Vikarabad: ఆలోచించాలి గానీ పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. సరిగ్గా ఆ ఆలోచన దిశగా అడగులు వేశారు ఆర్టీసీ అధికారులు. ఎండలో బస్సుకోసం ఎదురు చూసే ప్రయాణికుల కోసం అధికారులు వినూత్న ఆలోచన చేశాడు. తాత్కాలిక బస్సు షెల్టర్ గా బస్సునే ఏర్పాటు చేశాడు.

బస్సుషెల్టర్ అంటే బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండే షెల్టర్.. అయితే, విచిత్రం ఎమిటంటే ఇక్కడ ప్రయాణికుల కోసం బస్సే షెల్టర్‌గా మారింది. ఎండకు, వానకు ఇబ్బందిపడుతున్న ప్రయాణీకుల బాధలు చూడలేక వికారాబాద్ బస్ డిపో అధికారులు ప్రయాణీకుల కోసం ఓ బస్సునే షెల్టర్‌గా మార్చారు. ప్రయాణికులుకు ఇబ్బందులను గుర్తించి.. ఆర్టీసీ డిపోకే పరిమితమైన పాత బస్సులను బస్సు షెల్టర్‌గా తయారు చేయించారు.

వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో టెంపర్వరీ బస్సు షెల్టర్ పేరుతో ఈ బస్సును ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసి అధికారుల కోరుతున్నారు.

Tags:    

Similar News