Tokyo Olympics: ఒలింపిక్స్ లో భారత్ కు రెండో రజతం
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను మరో పతకం వరించింది.
Tokyo Olympics: ఒలింపిక్స్ లో భారత్ కు రెండో రజతం
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను మరో పతకం వరించింది. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా రజతం సాధించి పతకాల సంఖ్యను ఐదుకు చేర్చాడు. నిన్న జరిగిన సెమీస్‌లో అద్భుతంగా పోరాడి ఫైనల్‌కు దూసుకెళ్లిన దహియా బంగారు పతకంపై ఆశలు రేపాడు. అయితే, వరల్డ్ ఛాంపియన్ అయిన, రష్యా రెజ్లర్ ఉగెవ్ చేతిలో 4-7 తేడాతో ఓటమి చవి చూడడంతో భాతర్‌కు రజత పతకం ఖాయమైంది. మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధి ఆటగాడు క్రీడాస్పూర్తిని తప్పి రవిదహియాను గాయపరిచాడు. ఈ గాయం ప్రభావం ఫైనల్ మ్యాచ్‌పై పడినట్లు తెలుస్తోంది.