IND vs SL: నేడు భారత్‌, శ్రీలంక మూడో వన్డే.. మ.1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

IND vs SL: 3 వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్‌

Update: 2023-01-15 02:35 GMT

IND vs SL: నేడు భారత్‌, శ్రీలంక మూడో వన్డే.. మ.1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

IND vs SL: వరుస విజయాలతో శ్రీలంకపై ఇప్పటికే వన్డే సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసేందుకు సిద్ధమైంది. నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డే ఆడనుంది. ఇవాళ జరిగే నామమాత్ర పోరులో బెంచ్‌ బలాన్ని పరీక్షించే చాన్స్‌ ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి ఇప్పటికే సిరీస్‌ చేజిక్కించుకున్న రోహిత్‌ సేన.. ఆఖరి పోరులో ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌, పాండ్యాతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండగా బౌలింగ్‌ విభాగంలో అర్ష్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి వారిని పరీక్షించే చాన్స్‌ ఉంది. మరో రెండు రోజుల్లోనే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో లంకపై సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసి అదే ఉత్సాహంతో కివీస్‌తో తలపడాలని రోహిత్‌ సేన భావిస్తుంది. ఇక ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆఖరి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలున్నాయి. తిరువనంతపురం పిచ్ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా సహకరించనుండగా ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌ చేశాయి. మరోవైపు టీ20ల్లో పర్వాలేదనిపించిన శ్రీలంక వన్డేల్లో పెద్దగా ప్రతిఘటన చూపలేకపోతుంది.

Tags:    

Similar News