Tilak Varma : ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా విజయం.. గౌతమ్ గంభీర్ చెప్పినట్లు చేసిన తిలక్ వర్మ
Tilak Varma : ఇంగ్లండ్‌తో జరిగిన రెండో T20లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ, తన అద్భుత ప్రదర్శనకు గౌతమ్ గంభీర్‌నే కారణంగా పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ఒకరోజు ముందు గౌతమ్ గంభీర్ తనపై పెట్టిన నమ్మకాన్ని తిలక్ వర్మ నిలబెట్టుకున్నాడు.
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ప్రత్యేక సూచనలు ఇచ్చారని వెల్లడించాడు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలని, టీమ్ అవసరానికి తగిన విధంగా తన ఆటను మార్చుకోవాలని గంభీర్ సూచించాడని తిలక్ తెలిపాడు. ఒక ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సి వస్తే, దానికి తగినట్లు ఆడాలని, ఇతర పరిస్థితుల్లో కూడా అనుకూలంగా వ్యవహరించాలని కోచ్ చెప్పాడని వెల్లడించాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో T20లో భారత జట్టు చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం 15 పరుగుల వద్ద ఓపెనింగ్ జోడీ వెనుదిరగడంతో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో ఒత్తిడి పెరిగింది. అయినా తిలక్ వర్మ ఒంటరిగా పోరాడి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. తిలక్ వర్మ తన బ్యాటింగ్ ద్వారా మ్యాచ్‌లో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతను 55 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు, 4 బౌండరీలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ టీమ్ ఇండియాకు మరో విజయాన్ని అందించింది.
ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌ను 2-0 ఆధిక్యంలో కొనసాగించగా, మిగిలిన మ్యాచ్‌లపై కూడా ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలను క్రీడాకారులు పాటించడం, టీమ్ ఇండియా దూకుడుగా ఆడడం భారత అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.