IPL 2025: టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు: 97 పరుగుల హ్యాట్రిక్!

97-Run Hat-Trick Mania: Three Players, Three Victories, One Unbelievable T20 Record
x

IPL 2025: టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు: 97 పరుగుల హ్యాట్రిక్!

Highlights

IPL 2025: టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. గత రెండు రోజుల్లో ముగ్గురు బ్యాటర్లు 97 పరుగులు చేసి, తమ జట్లను గెలిపించారు.

IPL 2025: టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. గత రెండు రోజుల్లో ముగ్గురు బ్యాటర్లు 97 పరుగులు చేసి, తమ జట్లను గెలిపించారు. ఈ ముగ్గురు బ్యాటర్లూ నాటౌట్‌గా నిలవడం విశేషం. క్వింటన్ డి కాక్, శ్రేయాస్ అయ్యర్, టిమ్ సీఫెర్ట్ ఈ ఘనత సాధించారు.

శ్రేయాస్ అయ్యర్‌తో ప్రారంభం

97 పరుగుల విజయంలో మొదటివాడు శ్రేయాస్ అయ్యర్. మార్చి 25న పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో, శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అతని మెరుపు ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

టిమ్ సీఫెర్ట్ మెరుపులు

మార్చి 26న పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 38 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీఫెర్ట్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

క్వింటన్ డి కాక్ కూడా

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న క్వింటన్ డి కాక్ కూడా 97 పరుగుల జాబితాలో చేరాడు. గువాహటిలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. కోల్‌కతా జట్టు 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. డి కాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ ముగ్గురు బ్యాటర్లూ 97 పరుగులు చేసి, తమ జట్లను గెలిపించడం క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన.

Show Full Article
Print Article
Next Story
More Stories