Ind Vs Aus T20: ఈనెల 23న ఇండియా, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్.. టిక్కెట్ అమ్మకాలు షురూ
Ind Vs Aus T20: ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు
Ind Vs Aus T20: ఈనెల 23న ఇండియా, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్.. టిక్కెట్ అమ్మకాలు షురూ
Ind Vs Aus T20: విశాఖలో క్రికెట్ సందడి మొదలైంది. ఈనెల 23న ఇండియా, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుండి పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు 17, 18 తేదీల్లో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ - వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, వన్‌టౌన్ ఇందిరా ప్రియదర్శిని, మున్సిపల్ స్టేడియంతో పాటు గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.