IPL 2025: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ దక్కడంపై.. వెంకీ, బన్నీ, విజయ్, తారల రియాక్షన్ ఇదే..!!
IPL 2025: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ దక్కడంపై.. వెంకీ, బన్నీ, విజయ్, తారల రియాక్షన్ ఇదే..!!
IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్ 2025తో గ్రాండ్ విక్టరీ సాధించింది. 18ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం నిరీక్షించగా..ఇన్నాళ్లకు ఆ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటిసారి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది. దీంతో విరాట్ కోహ్లీకి ఆయన టీమ్ ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. ఆర్సీబీ విన్నర్ గా నిలిచిన తర్వాత కోహ్లీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆర్సీబీ 18ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించడంపై సినీ ప్రముఖులు స్పందించారు. ఆర్సీబీకి, కోహ్లీకి అభినందనలు తెలిపారు. వెంకటేశ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగవంశీ, సుధీర్ బాబు, కార్తీకేయ వంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు.
18ఏళ్ల నిరీక్షణ ఫలించినందుకు సంతోషంగా ఉంది..టోర్నమెంట్ అంతా జట్టు హ్రుదయపూర్వకంగా, ఉత్సాహంగా నైపుణ్యంతో ఆడింది. నిజంగా ఇది అర్హత కలిగిన విజయం అంటూ ట్వీట్ చేశారు వెంకటేశ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ..నిరీక్షణ ముగిసింది..చివరికి సాలా ఈ సారి కప్ మనదే..18ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నామంటూ విష్ చేశారు. విజయ్ దేవరకొండ స్పందిస్తూ..ఆర్సీబీకి, అర్సీబీ అభిమానులకు అభినందనలు. మీరు శక్తితో, అభిరుచితో, ప్రేమతో వేచి ఉన్నారు. చూడటానికి చాలా సంతోషకరమైన క్షణమని వెల్లడించారు.