IPL 2022: ఐపీఎల్ 2022 కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు వీళ్ళే..!!

* చెన్నై నుండి ధోని, గైక్వాడ్, జడేజా * బెంగుళూరు నుండి కోహ్లి, మాక్స్ వెల్ * ముంబై నుండి రోహిత్, బుమ్రా

Update: 2021-11-29 07:06 GMT

IPL 2022: ఐపీఎల్ 2022 కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళు వీళ్ళే..!!

IPL 2022: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నయమైంది. ఇప్పటికే ఫ్రాంచేజిలు తమ జట్టులో నుండి ఎవరిని రిటైన్ చేసుకోవాలో జాబితాని కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టులో ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోబోమని అనధికారిక ప్రకటన రాగా.. మిగిలిన జట్ల నుండి ఎవరెవరు ఏ ఆటగాళ్ళను రిటైన్ చేసుకోబోతున్నారో తాజాగా ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ద్వారా వార్తలు వచ్చాయి.

అందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రుత్ రాజ్ గైక్వాడ్ ని రిటైన్ చేసుకోగా దక్షిణాఫ్రికా ఆటగాళ్ళలో మొయిన్ అలీ లేదా ఫఫ్ డుప్లేసిస్ ఇద్దరిలో ఒక ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాని రిటైన్ చేసుకోగా.. అల్ రౌండర్ కిరన్ పోలార్డ్ తో పాటు ఇషాన్ కిషన్ ని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నుండి విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్ వెల్ ని రిటైన్ చేసుకోగా.., సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కేన్ విలియమ్సన్ తో పాటు రషిద్ ఖాన్ ని రిటైన్ చేసుకున్నారు.

కలకత్తా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సునీల్ నరేన్, రస్సెల్ ని రిటైన్ చేసుకోగా.., రాజస్తాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం సంజు సామ్సన్ ని రిటైన్ చేసుకుంది. ఇక చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం రిషబ్ పంత్, పృద్వీ షా, అక్సర్ పటేల్ తో పాటు నోర్త్జే ని రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. 

Tags:    

Similar News