IND vs SA: ఇండియా-సౌతాఫ్రికా మధ్య నువ్వా-నేనా అనే ఫైట్
IND vs SA: వరల్డ్‌కప్‌లో ఇవాళ మరో ఆధిపత్య పోరు
IND vs SA: ఇండియా-సౌతాఫ్రికా మధ్య నువ్వా-నేనా అనే ఫైట్
IND vs SA: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి.. ఓటమి ఎరుగని టీమ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సెమీస్ బెర్తు కన్ఫామ్ చేసుకున్న ఇరు జట్ల మధ్య కాసేపట్లో జరగబోయే పోరు.. సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ రెండు టీమ్‌ల మధ్య ఆదివారం ఆధిపత్యపోరు జరగనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఈ రెండు టీమ్‌లు.. తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అయితే.. ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధిస్తే.. 16 పాయింట్లతో టాప్‌లోనే కొనసాగనుంది. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన జోరులో ఉన్న సౌతాఫ్రికా సైతం ఇండియాను ఓడించి టాప్ ప్లేస్‌కు రావాలని చూస్తోంది.
ఈడెన్‌లో జరగబోయే మ్యాచ్‌లో భారత్ గెలుపుతో పాటు.. విరాట్ కోహ్లీ నుంచి మరో సెంచరీ ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే సందర్భంగా.. అందరి ఫోకస్ కింగ్‌పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి వన్డేల్లో సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేయాలని కింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వన్డే వరల్డ్‌కప్ టోర్లీలో మూడుసార్లు సెంచరీని మిస్ చేసుకున్నాడు కోహ్లీ. ఆస్ట్రేలియాపై 85 పరుగులు, న్యూజిలాండ్‌పై 95 పరుగులు, శ్రీలంకపై 88 పరుగులు చేసిన కోహ్లీ.. కొద్దిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో ఈ పోరులోనైనా సచిన్ రికార్డును సమం చేసి.. తన ఫ్యాన్స్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా..? అన్న ఎదురుచూపు ఫ్యాన్స్‌లో ఉంది. అటు సౌతాఫ్రికాపై విజయం, ఇటు కోహ్లీ సెంచరీ కోసం ఫ్యాన్స్ ఈడెన్‌లో వేలాది కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సండే.. సూపర్ సండేగా మారనుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా దిగుతోంది. అయితే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇండియా కంటే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న సౌతాఫ్రికా.. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు వెళ్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా ఇప్పటివరకు 22 వన్డేలు ఆడింది. అందులో 13 గెలిచింది. ఇండియా-సౌతాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటివరకూ 90 మ్యాచ్ లలో తలపడ్డాయి. అందులో భారత్ 50 మ్యాచుల్లో గెలవగా.. సౌతాఫ్రికా 37 మ్యాచుల్లో విజయం సాధించింది. మిగతా 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ మ్యాచుల విషయానికి వస్తే.. ఇరుజట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. రెండుసార్లు టీమిండియా గెలిచింది.