Team India : టీమిండియా బిజీ షెడ్యూల్.. ఆసియా కప్ నుంచి 2026 వరల్డ్ కప్ వరకు ఫుల్ ప్లాన్ ఇదే
Team India: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుకు ఒక చిన్న విరామం లభించింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్ రద్దవడం వల్ల, టీమిండియా ఆగస్టులో ఎలాంటి మ్యాచ్‌లు ఆడటం లేదు.
Team India : టీమిండియా బిజీ షెడ్యూల్.. ఆసియా కప్ నుంచి 2026 వరల్డ్ కప్ వరకు ఫుల్ ప్లాన్ ఇదే
Team India: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుకు ఒక చిన్న విరామం లభించింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్ రద్దవడం వల్ల, టీమిండియా ఆగస్టులో ఎలాంటి మ్యాచ్‌లు ఆడటం లేదు. అయితే, సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్తో భారత జట్టు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూసే దాయాది పోరు సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో జరగనుంది.
ఆసియా కప్ 2025లో భారత జట్టు మ్యాచ్‌ల వివరాలు:
భారత్ vs యూఏఈ: సెప్టెంబర్ 10, బుధవారం
భారత్ vs పాకిస్తాన్: సెప్టెంబర్ 14, ఆదివారం
భారత్ vs ఒమన్: సెప్టెంబర్ 19, శుక్రవారం
ఈ మ్యాచ్‌లలో భారత్ గ్రూప్ Aలో ఉంటుంది. గ్రూప్‌లో అగ్రస్థానం సాధిస్తే, సూపర్ 4 దశలో కూడా ఆడాల్సి ఉంటుంది.
వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో బిజీ షెడ్యూల్
ఆసియా కప్ తర్వాత టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్ మొదలవుతుంది.
భారత్ vs వెస్టిండీస్ (అక్టోబర్): స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్ట్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్ అక్టోబర్ 10న ఢిల్లీలో జరుగుతుంది.
భారత్ vs ఆస్ట్రేలియా (అక్టోబర్-నవంబర్): ఆ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19న తొలి వన్డేతో ప్రారంభమవుతుంది.
భారత్ vs ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్:
వన్డేలు:
అక్టోబర్ 19: తొలి వన్డే (పెర్త్)
అక్టోబర్ 23: రెండో వన్డే (అడిలైడ్)
అక్టోబర్ 25: మూడో వన్డే (సిడ్నీ)
టీ20లు:
అక్టోబర్ 29: తొలి టీ20 (కాన్బెరా)
అక్టోబర్ 31: రెండో టీ20 (మెల్బోర్న్)
నవంబర్ 2: మూడో టీ20 (హోబర్ట్)
నవంబర్ 6: నాలుగో టీ20 (గోల్డ్ కోస్ట్)
నవంబర్ 8: ఐదో టీ20 (బ్రిస్బేన్)
సౌతాఫ్రికా,న్యూజిలాండ్‌తో హోమ్ సిరీస్‌లు
నవంబర్ నుంచి టీమ్ ఇండియా స్వదేశంలో మరో రెండు కీలక సిరీస్‌లు ఆడనుంది.
భారత్ vs సౌతాఫ్రికా (నవంబర్-డిసెంబర్): ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. తొలి టెస్ట్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమవుతుంది.
భారత్ vs న్యూజిలాండ్ (జనవరి 2026): వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఉంటుంది. ఇది జనవరి 11, 2026న తొలి టీ20తో ప్రారంభం అవుతుంది.
ఈ సిరీస్‌లన్నీ ముగిసిన తర్వాత, భారత జట్టు శ్రీలంక-భారత్ వేదికగా జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్‌కు సన్నాహాలు చేస్తుంది. ఈ బిజీ షెడ్యూల్‌తో భారత క్రికెట్ అభిమానులకు వచ్చే కొన్ని నెలలు పండుగే.