IND vs AUS: నాగపూర్ టెస్ట్‌లో ముగిసిన రెండో రోజు ఆట.. 144 పరుగుల ఆధిక్యంలో భారత్
IND vs AUS: 7 వికెట్లకు 321 పరుగులు చేసిన భారత్
IND vs AUS: నాగపూర్ టెస్ట్‌లో ముగిసిన రెండో రోజు ఆట.. 144 పరుగుల ఆధిక్యంలో భారత్
IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగపూర్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 7వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. భారత్‌కు 144 పరుగుల ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. జడేజా బౌలింగ్‌లో 5 వికెట్లు తీయడమే కాదు... బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో టూడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.