ICC Test Rankings: ఆస్ట్రేలియాకు ఇచ్చి పడేసిన టీమిండియా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్..!

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు టాప్ ప్లేస్ లోకి వచ్చింది.

Update: 2023-05-02 12:16 GMT

ICC Test Rankings: ఆస్ట్రేలియాకు ఇచ్చి పడేసిన టీమిండియా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్..!

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు టాప్ ప్లేస్ లోకి వచ్చింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి..రోహిత్ శర్మ సేన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 15 నెలల పాటు టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా రెండవ స్థానానికి పడిపోయింది. ర్యాంకింగ్స్ రిలీజ్ కావడానికి ముందు ఆస్ట్రేలియా 122 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. టీమిండియా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

అయితే మే 2020 నుంచి మే 2022 లోపు ముగిసిన అన్ని సిరీస్ లను పరిగణలోకి తీసుకొని తాజా ర్యాంకింగ్స్ ను రూపొందించారు. దీంతో పాక్, కివీస్ లపై ఆసీస్ నెగ్గినా ఆ జట్టుకు పాయింట్లు కలిసి రాలేదు. దీంతో 121 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా 116 పాయింట్లకు పడిపోయింది. ఇక ఇదే సమయంలో 2019లో కివీస్ తో భారత్ సిరీస్ ఓటమిని ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగా భారత్ కు రెండు పాయింట్లు కలిసివచ్చాయి. 119 నుంచి 121 పాయింట్లు సాధించినట్లయింది.

Tags:    

Similar News