T20 World Cup: మా వీసాలకు హామీ ఇవ్వండి: ఐసీసీని వేడుకున్న పాక్‌

T20 World Cup : వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆట‌గాళ్లు ఆడేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. భారత్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటుంది పాకిస్తాన్

Update: 2020-10-21 07:34 GMT

Pakistan Cricket Board: వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆట‌గాళ్లు ఆడేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. భారత్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటుంది పాకిస్తాన్, . రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లన్నీ రద్దు అయ్యాయి విష‌యం తెలిసిందే.

అయితే వచ్చే ఏడాది భార‌త్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు మంజూరుపై హామీ ఇవ్వాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వసీం ఖాన్‌ ఐసీసీకి తెలిపారు. ఉద్రికత్తల నడుమ ద్వైపాక్షిక సిరీస్‌ ఉంటుందని ఆశించడం లేదన్న వసీంఖాన్..ప్రపంచకప్‌ అనేది ఐసీసీకి సంబంధించిన విషయమన్నారు..ఐసీసీ నిబంధనల ప్రకారం టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశం ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లన్నింటికీ అన్ని రకాల వసతులు కల్పించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. తమ ఆటగాళ్లకు వీసాల అందేలా ఐసీసీ హామీ ఇస్తుందని భావిస్తున్నామన్నాడు ఐసీసీ కలగజేసుకొని భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని జట్లకు టోర్నమెంట్‌ను నిర్వహించే దేశమే వసతులు కల్పించాల్సి ఉంటుందని, పాకిస్తాన్‌ కూడా అందులో భాగమేనని వసీం ఖాన్‌ తెలిపారు. తమ ఆటగాళ్లకు వీసాలు వచ్చేలా ఐసీసీ హామీ ఇస్తుందని అనుకుంటున్నామన్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో ఐసీసీ మాట్లాడలని ఆయన కోరారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ముంబాయిపై ఉగ్రవాదుల దాడి తర్వాత అంటే 2008 తర్వాత భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌లో అడుగు పెట్టలేదు. పాకిస్తాన్‌ మాత్రం మన దేశంలో జరిగిన టీ-20 సిరీస్‌లో పాల్గొన్నది.

Tags:    

Similar News