IPL 2021 SRH vs DC: హైదరాబాద్ లక్ష్యం 160; పృథ్వీ​షా హాఫ్ సెంచరీ

IPL 2021 SRH vs DC: హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టీం 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

Update: 2021-04-25 15:51 GMT

పృథ్వీ​షా (ఫొటో ట్విట్టర్)

IPL 2021 SRH vs DC: హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టీం 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 160 పరుగుల లక్ష్యం ఉంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ ఓపెనర్లు ధాటిగానే ఇన్నింగ్స్ ను ఆరంభించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ​షా , శిఖర్‌ ధవన్‌ మొదటి వికెట్ కి 81 పరుగుల భాగస్వామ్యం సాధించారు.

మంచి ఊపుమీదున్న జోడికి రషిద్‌ ఖాన్‌ బ్రేకులు వేశాడు. శిఖర్‌ ధవన్‌ను 28 పరుగులు(26 బంతులు, 3 ఫోర్లు) వద్ద బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే తరువాతి ఓవర్‌లో పృథ్వీ​షా 53 పరుగుల(39 బంతులు, 7ఫోర్లు, 1సిక్స్) వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్, స్టీవ్ స్మిత్(34పరుగులు, 3ఫోర్లు, 1సిక్స్) ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ ను పెంచారు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యం చేరి బలంగా తయారైన జోడిని కౌల్ విడదీశాడు. రిషభ్ పంత్(37పరుగలు, 27 బంతులు, 4ఫోర్లు, 1సిక్స్)ను 18.2 వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన హిట్ మేయర్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు.

హైదరాబాద్ బౌలర్లలో కౌల్ 2 వికెట్లు, రషీద్ 1 వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News