వినోద్ కాంబ్లీ కోసం క్రికెట్ లెజెండ్ ఆర్థిక సహాయం... BCCI పెన్షన్‌తో కలిపి ఇకపై నెలకు ఎంత వస్తుందంటే..

Update: 2025-04-15 10:54 GMT

వినోద్ కాంబ్లీ కోసం క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆర్థిక సహాయం...బీసీసీఐ పెన్షన్‌తో కలిపి ఇకపై నెలకు ఎంత వస్తుందంటే..

Vinod Kambli gets help from Sunil Gavaskar

Vinod Kambli gets help from Sunil Gavaskar: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి మరో క్రికెట్ లెజెండ్ రూపంలో గ్రేట్ సపోర్ట్ లభించింది. యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యకు వినోద్ కాంబ్లీ థానెలోని ఆకృతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఒకవైపు కెరీర్‌లో డౌన్‌ఫాల్ అవడం, మరోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో కాంబ్లి ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. ఒకప్పుడు ఇండియా తరపున 100 కు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన వినోద్ కాంబ్లీ ఇప్పుడు ఇంటికే పరిమితమై మరొకరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

వినోద్ కాంబ్లీ పరిస్థితి తెలుసుకుని ఇప్పటికే అనేక సందర్భాల్లో సునిల్ గవాస్కర్ ఆయనకు అండగా నిలిచారు. కాంబ్లికి కష్టకాలంలో తనవంతు సహాయం అందిస్తూ వచ్చారు. తాజాగా కాంబ్లీకి ఏప్రిల్ 1 నుండి ప్రతీ నెల రూ. 30000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు గవాస్కర్ హామీ ఇచ్చారు.

సునీల్ గవాస్కర్ 1999 లో ఛాంప్స్ అనే ఫౌండేషన్ ను స్థాపించారు. ఆ ఫౌండేషన్ ద్వారా క్రీడారంగంలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ఆటగాళ్లు, అథ్లెట్స్ కు తోడుగా నిలుస్తున్నారు. ఇకపై ప్రతీ నెల రూ. 30 వేలు ఆర్థిక సహాయం కూడా ఆ ఛాంప్స్ ఫౌండేషన్ ద్వారానే అందించనున్నారు.

ఇండియా తరుపున వినోద్ కాంబ్లీ 104 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. టీమిండియాకు ఆయన అందించిన సేవలకు బదులుగా ప్రస్తుతం బీసీసీఐ నుండి నెల నెల రూ. 30,000 చొప్పున పెన్షన్ పొందుతున్నారు. తాజాగా సునీల్ గవాస్కర్ ప్రకటించిన సహాయంతో ఇకపై ఆ మొత్తం రూ. 60,000 చేరుకుంటుంది. వినోద్ కాంబ్లీ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఏడాది హెల్త్ ఎక్స్‌పెన్సెస్ కోసం అదనంగా రూ. 30,000 అందించనున్నట్లు గవాస్కర్ హామీ ఇచ్చారు.

ఈ ఏడాది ముంబై వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ఒక ఈవెంట్ నిర్వహించింది. వాంఖడే స్టేడియంతో అనుబంధం ఉన్న ఆటగాళ్లను అతిథులుగా ఆహ్వానించింది. ఆ కార్యక్రమానికి వెళ్లిన వినోద్ కాంబ్లీ అక్కడ సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించి (Vinod Kambli's respect for Sunil Gavaskar) ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు. "సరిగ్గా నడవడానికి కూడా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, గవాస్కర్‌పై గౌరవం చూపించడానికి వెనుకాడని కాంబ్లీ" అంటూ అప్పట్లో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News