ICC Ban : క్రికెట్ ప్రపంచంలో మరో కలకలం.. 5233 పరుగులు, 373 వికెట్లు తీసిన స్టార్ ఆల్ రౌండర్ పై నిషేధం!
ICC Ban : క్రికెట్ ప్రపంచంలో మరో కలకలం.. 5233 పరుగులు, 373 వికెట్లు తీసిన స్టార్ ఆల్ రౌండర్ పై నిషేధం!
ICC Ban : క్రికెట్ ప్రపంచంలో మరో కలకలం.. 5233 పరుగులు, 373 వికెట్లు తీసిన స్టార్ ఆల్ రౌండర్ పై నిషేధం!
ICC Ban : క్రికెట్ ప్రపంచంలో మరోసారి అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఒక మాజీ ఆల్ రౌండర్ అవినీతికి పాల్పడినందుకు ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఆటగాడిపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ క్రికెటర్ పేరు సలియా సమన్. 2021లో జరిగిన అబుదాబి టి10 లీగ్‌లో అవినీతికి పాల్పడినందుకు ఐసీసీ అతడిని దోషిగా తేల్చింది. ఈ ఘటన క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది.
సలియా సమన్‌పై ఎందుకీ నిషేధం?
సలియా సమన్ శ్రీలంకకు చెందిన మాజీ డొమెస్టిక్ క్రికెటర్. 2021 అబుదాబి టీ10 లీగ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించినందుకు అతడు దోషిగా తేలాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2023 సెప్టెంబర్‌లో కోడ్ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న ఎనిమిది మంది వ్యక్తుల్లో సమన్ కూడా ఉన్నాడు. ఈ ఆరోపణలు 2021 అబుదాబి టీ10 క్రికెట్ లీగ్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించడం, అవినీతి కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి వాటికి సంబంధించినవి. ఐసీసీ, ఈసీబీ సంయుక్తంగా ఈ వ్యవహారాన్ని ఛేదించాయి.
2023 సెప్టెంబర్ 13 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ఐసీసీ ఆగస్టు 15, 2025న ఒక ప్రకటనలో తెలిపింది. సమన్‌పై ఆర్టికల్ 2.1.3 ప్రకారం కూడా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. సమన్ తో పాటు పుణె డెవిల్స్ ఫ్రాంచైజీ సహ-యజమానులు కృష్ణ కుమార్ చౌదరి, పరాగ్ సంఘవి, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హుస్సేన్, డొమెస్టిక్ ఆటగాడు రిజ్వాన్ జావేద్, బ్యాటింగ్ కోచ్ అషర్ జైదీ, అసిస్టెంట్ కోచ్ సన్నీ ధిల్లాన్, టీమ్ మేనేజర్ షాదాబ్ అహ్మద్ వంటి వారిపై కూడా ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ ఆరోపణలు చేసింది.
సలియా సమన్ రికార్డులు
సలియా సమన్ డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు. 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 27.95 సగటుతో 3622 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 129 పరుగులు. అలాగే, 25.92 సగటుతో 271 వికెట్లు తీశాడు. 77 లిస్ట్ A మ్యాచ్‌ల్లో 898 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 65 పరుగులు. 27.63 సగటుతో 84 వికెట్లు పడగొట్టాడు. 47 T20 మ్యాచ్‌లలో 129.92 స్ట్రైక్ రేట్‌తో 678 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 78 నాటౌట్. 18.68 సగటుతో 58 వికెట్లు తీసుకున్నాడు.